వంటింటి చిట్కాలు..!

-వెన్న కాచేటప్పుడు తాజా తమలపాకు వేసి కాచితే నెయ్యి తాజాగా ఉండి మంచి వాసన వస్తు, ఎక్కువ కాలం నిలువ ఉంటుంది.
-గుడ్డు పచ్చసొన వంట గది గట్టు మీద పడితే ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మరక కనిపించదు.

-పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే సరి.
-కాఫీ మరింత రుచిగా ఉండాలంటే వేడిపాలలో చిటికెడు ఉప్పు వేసి చూడండి.
-బత్తాయి రసం తీశాక గింజలను వేరుచేశాక మిగిలిన గుజ్జులో చక్కెర కలుపుకొని తింటే రుచికరంగా ఉంటుంది, చక్కటి పోషకాలు అందుతాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.