నలుపు తగ్గేందుకు!

చాలామంది మహిళలు స్లీవ్‌లెస్ టాప్స్‌పే ఇష్టపడుతుంటారు. కానీ చేతుల కింద (అండర్ ఆర్మ్స్) చర్మం నలుపుగా ఉండడంతో వ్యాక్సింగ్ చేస్తుంటారు. అయినా కొంతమందికి ఫలితం ఉండదు. ఈ కింది చిట్కాలను పాటించి ఇక మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి.

-ఆలుగడ్డను చిన్న ముక్కలుగా చేసి రసం తీయాలి. అందులో కొంచెం తేనెను కలుపాలి. ఈ మిశ్రమాన్ని చేతుల కింద నలుపుచర్మానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.
-టమాటా, ఆలుగడ్డలను ముక్కలు చేసి పేస్ట్ట్ తయారు చేయాలి. ఈ పేస్టును చేతుల కింద ఐప్లె చేయాలి. 30 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
-నిమ్మరసం, ఆలు రసాన్ని బాగా కలుపాలి. అందులో కొంచెం చక్కెర కలుపాలి. ఈ మిశ్రమాన్ని నలుపు చర్మానికి రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే చర్మం మృదువుగా ఉంటుంది.
-కీరదోస, ఆలుగడ్డ రసంలో శనగపిండి కలుపాలి. ఈ మిశ్రమాన్ని నలుపు చర్మానికి రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. 

©2019 APWebNews.com. All Rights Reserved.