నల్లని వలయాలా?

అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా ఎవరికైనా ఏ వయసులో అయినా ఈ సమస్య వస్తుంది. మరి ఆ నల్లని వలయాలను ఎలా తగ్గించాలి?

-కళ్ల చుట్టూ నల్లని వలయాలను తొలగించడంలో టమాటా అద్భుతంగా పనిచేస్తుంది. టమాటా రసం, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ చుట్టూ రాయాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
-ఆలు రసంలో దూదిని ముంచి ఆ దూదిని కళ్లు మొత్తం కవర్ అయ్యేలా పెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత దూదిని తీసేసి కళ్లను శుభ్రం చేసుకోవాలి.
-టీ బ్యాగును నీటిలో తడిపి, కొంచెం సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత కళ్ల మీద ఉన్న నల్లని వలయాలపై పెట్టాలి. ఇలా రోజు చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
-చల్లని పాలలో దూదిని ముంచి ఆ దూదిని కళ్లపై పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత కళ్లను క్లీన్ చేసుకోవాలి.
-నారింజ రసంలో కొంచెం గ్లిజరిన్ చుక్కలు వేసి కలపాలి. ఆ రసాన్ని డార్క్ సర్కిల్‌పై రాయాలి. ఇలా చేస్తే మీ కళ్లు కాంతి వంతంగా తయారవుతాయి.
-దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత డార్క్ సర్కిళ్లపై పెట్టుకోవాలి.10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
-చాలామందికి డిప్రెషన్, ఒత్తిడి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.