కీరదోస నీళ్లతో చక్కటి ఆరోగ్యం..!

ఎండలు మండుతున్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్ ఇబ్బంది పెడుతుంది. అలానే శరీరంలో వ్యర్దాలు చేరి పోయి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిని దూరం చేసుకోవాలంటే పుదీనాతో ఇలా చేసి చూడండి. ఓ సీసాలో నీళ్లు తీసుకొని అందులో కీరదోస ముక్కలు రెండు చక్రాల్లా తరిగిన నిమ్మముక్కలు నాలుగు పుదీన ఆకులు వేసి రాత్రి పూట ఉంచాలి. కీరదోస నీళ్లను వేసవికాలంలో రోజూ ఆరు గ్లాసులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.కీరదోస నీళ్లను రోజూ తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య రాకుండా వుంటుంది. నీళ్లలో కీర ముక్కలను రోజుకంటే ఎక్కువ వుంచకూడదు. కావాలనుకుంటే రుచి కోసం నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ నీటిని తాగిన తర్వాత కీరదోస ముక్కల్ని కూడా తినేయవచ్చు. కీరదోస నీటిని సేవించడం ద్వారా చర్మం ఆరోగ్యంగా వుంటుంది. ఈ నీరు బరువు తగ్గించడంలో భేష్‌గా పనిచేస్తుంది. ఆకలిగా వున్నప్పుడు కీరదోస నీటిని సేవిస్తే పొట్టనిండిన భావన కలుగుతుంది. ఈ నీటిలో పుష్కలంగా వుండే విటమిన్-కె, మాంసకృత్తులు, ఎముకలకు బలాన్నిస్తాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.