ములగాకు రసంతో మొటిమల నివారణ

ములగ ఎవరు తింటారు ఒట్టి పిప్పి... ఎవరు నమలుతారు అని కొంతమంది మునగను పక్కనపెడతారు. కానీ దీనితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. మొటిమలతో బాధపడేవారు ములగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ములగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధ బాధ ఉండదు. ములగాకు పొడిని రోజూ పరగడుపున చెంచా పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే గాస్ట్రిక్ అల్సర్ దరిచేరదు. 

ములగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాయాలి. ములగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. ములగాకు నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 

ములగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెలరోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. ములగ పూలు, పాలలో వేసుకొని తాగాలి. దీనివలన ఆడవారికి, మగవారికి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. 

ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడిచెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది. ములగ రసం క్యారెట్ రసంతో కలిపి తాగాలి. పచ్చిదోస రసం, మునగ రసం చెరొక గరిటెడు కలిపి తాగినా మూత్రం సాఫీగా అవుతుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.