నువ్వుల నూనెతో చుండ్రుకు చెక్..!

సాధారాణంగా నువ్వులు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసేవుంటాయి. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. ఈ నువ్వుల్లో అన్నిరకాల పోషకాలు ఇమిడివుంటాయి. అందుకే వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్, విటమిన్ ఇ లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు ఇందులో ఉన్నాయి. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అలాంటి నువ్వులతో తీసిన నూనెతో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
 
ముఖ్యంగా, జుట్టు మృదువుగా ఉండాలన్న, చుండ్రు మాయంకావాలన్న నువ్వుల నూనే బెస్ట్‌ అంటున్నారు. నువ్వుల నూనేతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నువ్వుల నూనెతో కేశాలకు, తలకు బాగా పట్టిస్తే, హెయిర్‌ సెల్స్‌ యాక్టివ్‌‌గా ఉండే హెయిర్‌ గ్రోత్‌‌ను ప్రోత్సహిస్తుంది. అల్ట్రా వైలెట్‌ కిరణాల ప్రభావం జుట్టు మీదపడకుండా నువ్వుల నూనే రక్షిస్తుంది. చాలావరకూ జుట్టు సమస్యలు చుండ్రువల్లనే ఎదురవుతాయి. చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె. 
©2019 APWebNews.com. All Rights Reserved.