గోధుమపిండితో.. ఫేస్‌ప్యాక్‌..!

ముఖం కాంతివంతంగా తయారవడానికి మనం ఎక్కువగా శనగపిండిని ఉపయోగిస్తుంటాం. గోధుమపిండితోనూ పేస్‌ప్యాక్‌ వేసుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు.

- స్పూన్‌ గోధుమపిండికి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పెరుగు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికోసారి అప్లై చేస్తే, చర్మం కాంతివంతంగా మారుతుంది. 
- స్పూన్‌ గోధుమపిండిలో రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌ని పేస్ట్‌లా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. 
- పావుకప్పు గోధుమలను రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయం వాటిని మిక్సీలో వేసి, మెత్తగా రుబ్బాలి. ఆ పేస్టులో నుంచి గోధుమ పాలను వడకట్టాలి. ఆ పాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి మసాజ్‌ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం నిగారింపు వస్తుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.