పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే పసుపు టీ..!

భారతీయుల వంటి ఇంటి పదార్థాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అనేక వంటకాల్లో నిత్యం పసుపును ఉపయోగిస్తుంటారు. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, లినోలీనిక్ యాసిడ్లు, ప్రోటీన్లు తదితర పోషకాలు పసుపు ద్వారా మనకు లభిస్తాయి. అయితే పసుపుతో తయారు చేసే టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక పాత్రలో కొంత నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు పసుపు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో పుదీనా ఆకులు లేదా దాల్చిన చెక్క పొడి, తేనె, అల్లం రసంలలో ఏదైనా ఒక దాన్ని రుచి కోసం వేస్తే చాలు. పసుపు టీ తయారైనట్లే. దీన్ని తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.

పసుపు టీ తాగడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పసుపు టీ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.