గ్యాస్ సమస్యను తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!

మనలో అధిక శాతం మందికి భోజనం చేయగానే తీవ్రమైన గ్యాస్ వస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.

మరో వైపు గ్యాస్ వల్ల త్రేన్పులు రావడమో, మరో విధంగా గాలి బయటకు వెళ్లడమో జరుగుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇలా జరిగితే ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే అలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. గ్యాస్ సమస్య తగ్గుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 

1. భోజనం చేసేటప్పుడు వీలైనంత వరకు ద్రవాలను తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ చేరుతుంది. భోజనం చేయక ముందు, చేశాక కనీసం 20 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే నీరు తాగాలి. లేదంటే గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతుంది. 

2. చాలా మంది ఆహారాన్ని త్వరగా తినేస్తారు. సరిగ్గా నమలరు. అలా చేయరాదు. ఆహార పదార్థాలను బాగా నమిలి మింగాలి. నెమ్మదిగా భోజనం చేయాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. 

3. భోజనం చేశాక కొంతసేపు వాకింగ్ చేసినా గ్యాస్ సమస్య రాదు. రోజూ నిర్ణీత సమయం పాటు వ్యాయామం చేస్తే గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. 

4. నిత్యం తినే ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలి. ఉప్పు వల్ల జీర్ణాశయంలో నీరు ఎక్కువగా చేరుతుంది. ఇది గ్యాస్ సమస్యను సృష్టిస్తుంది. కనుక ఉప్పును తగ్గించాలి. 

5. శీతల పానీయాలు, సోడాలు వీలైనంత వరకు తక్కువగా తాగాలి. వీటిని తాగితే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా చేరుతుంది. అది ఇబ్బందులకు గురి చేస్తుంది. 

6. నిత్యం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. 

7. కొందరికి పాలు, పాల సంబంధ పదార్థాలు తింటే గ్యాస్ వస్తుంది. ఈ అంశాన్ని గమనించాలి. ఒక వేళ ఈ పదార్థాలను తినడం మానేస్తే గ్యాస్ సమస్య తగ్గుతుందేమో చూడాలి. అలా గనక జరిగితే పాల సంబంధ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అలా చేయడం వల్ల గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. 

8. కొందరు పప్పు దినుసులు ఎక్కువగా తింటే గ్యాస్ విపరీతంగా వస్తుంది. అలాంటి వారు పప్పు దినుసులను తక్కువగా తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. 

9. బ్రొకోలి, క్యాబేజీ తదితర కూరగాయల వల్ల కూడా కొందరిలో గ్యాస్ వస్తుంటుంది. కనుక వీటిని తినడం మానేస్తే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 

10. బొప్పాయి, పైనాపిల్ పండ్లను ఎక్కువగా తింటే గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. వీటిల్లో ఉండే సహజసిద్ధమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. 

©2019 APWebNews.com. All Rights Reserved.