రోజూ ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే..?

కొబ్బ‌రినీళ్ల‌లో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కేవ‌లం ఎండాకాలంలో మాత్ర‌మే.. దాహం తీర్చుకోవ‌డం కోసం, శ‌క్తి కోసం తాగుతారు. కానీ నిజానికి ఈ నీళ్ల‌ను ఏ కాలంలో అయినా తాగ‌వ‌చ్చు.

ఎప్పుడు తాగినా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ ప‌ర‌గ‌డుపున కొబ్బ‌రి నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. ఏ వ్యాధి వ‌చ్చినా త‌ట్టుకునే శ‌క్తి శ‌రీరానికి ల‌భిస్తుంది.

2. కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరంలో ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం క్లీన్ అవుతుంది. అలాగే మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు రావు. మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు క‌రిగిపోతాయి.

3. కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగితే శ‌రీరానికి కొత్త ఉత్సాహం వ‌స్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఏ ప‌ని ఎంత సేపు చేసినా త్వ‌ర‌గా అల‌సిపోరు. శారీర‌క శ్ర‌మ చేసే వారు, వ్యాయామం చేసే వారు ఉద‌యాన్నే కొబ్బ‌రినీళ్లను తాగ‌డం వ‌ల్ల అమిత‌మైన శ‌క్తిని పొంద‌వ‌చ్చు.

4. కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు పోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

5. కొబ్బ‌రి నీళ్లు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను శుభ్రం చేస్తాయి. జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు చ‌నిపోతాయి. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

6. శ‌రీరంలో నీరు అంతా పోయి డీహైడ్రేష‌న్ బారిన ప‌డే వారికి త‌ల‌నొప్పి వ‌స్తుంది. దీన్ని త‌గ్గించుకోవాలంటే ఉద‌యాన్నే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగాలి. దీంతో స‌మ‌స్య రాకుండా ఉంటుంది.

7. తల్లి పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. క‌నుక‌ ఈ నీళ్లను పిల్లలు తాగితే వారు మానసికంగా, శారీరకంగా బాగా ఎదుగుతారు. వారికి చ‌క్క‌ని పోష‌ణ ల‌భిస్తుంది.

8. గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు పోతాయి. దీంతో గ‌ర్భాశ‌యంలో ఉండే బిడ్డకు ఆరోగ్యం క‌లుగుతుంది. పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.