రన్నింగ్‌ కన్నా ముందు..?

దారి వెంట అలా నడుస్తున్నప్పుడో, మెట్లు ఎక్కుతున్నప్పుడో అరుదుగా ఎప్పుడైనా కీళ్లల్లో కాస్త నొప్పి అనిపిస్తే ఎవరైనా అది మామూలే అనుకుంటారు.

కానీ, తరుచూ అలా నొప్పి అనిపిస్తున్నప్పుడు గానీ, ఏదో సమస్య ఉన్నట్లు ఎవరూ గుర్తించరు. అయితే వాకింగ్‌ జాగింగ్‌లు చేస్తే మోకాళ్లకు సంబంధించిన సమస్త సమస్యలూ తొలగిపోతాయనే భావన చాలా మందిలో ఉంది. కానీ, అంతకన్నాముందు తొడ, పిక్క కండరాలు గ ట్టిపడే వ్యాయామాలు చేయాల్సి ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి, మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడాలనుకునే వారు...

కాలు, పిక్క కండరాలు గట్టిపడే స్క్వాట్‌, బ్రిడ్జెస్‌, హిప్‌ స్టెబిలిటీ వ్యాయామాల్ని రోజూ క్రమం తప్పకుండా చేయాలి. అనుకున్న రన్నింగ్‌, జాగింగ్‌ చేయడానికి 6 నుంచి 8 వారాల దాకా చేసి ఆ తర్వాతే రన్నింగ్‌ గానీ, జాగింగ్‌ గానీ చేయాలి. అలా ఏమీ చేయకుండా సరాసరిగా రన్నింగ్‌లు, జాగింగ్‌లు చేస్తే, కలిగే లాభం మాట అటుంచి, మోకాలు కీలు మరింత దెబ్బ తినే ప్రమాదం ఉంది.
ఇతర వ్యాయామాలన్నీ చేశాక కూడా రన్నింగ్‌లో నొప్పి అనిపిస్తే, కొద్ది రోజుల పాటు విరామం తీసుకోవాలి. ఐస్‌ గడ్డను గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న భాగాల్లో ఉంచి అటూ ఇటూ తిప్పాలి. నొప్పి తగ్గగానే మళ్లీ వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇలా తగ్గిన నొప్పి అంతటితో పూర్తిగా పోతే సరే సరి! ఒకవేళ కొద్ది రోజుల తర్వాత నొప్పి మళ్లీ వస్తే, వెంటనే ఫిజియో థెరపి్‌స్టను గానీ, ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ను గానీ, సంప్రదించాలి.
©2018 APWebNews.com. All Rights Reserved.