టూత్‌పేస్ట్‌తో ట్రిక్కులు..!

టూత్‌పేస్ట్ పళ్లను మాత్రమే కాదు.. ఇంటినీ శుభ్రం చేస్తుంది. ఆశ్చర్యపోతున్నారు కదా.. మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు, ఇతర సుగంధాలే కాదు.. దుమ్ము, ధూళిని పోగొట్టే శక్తి ఉంది. పేస్ట్‌తో ఎన్ని ట్రిక్కులు ఫాలో అవ్వొచ్చో చదువండి.

 -లిప్‌స్టిక్, ఇంకు మరకలు షర్ట్‌ని పాడుచేస్తాయి. తెల్లని బట్టలపై ఉన్న మరకలను నివారించడంలో టూత్‌పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. మరకలు ఉన్న ప్రాంతంలో పేస్ట్ రాసి కొద్దిగా రుద్ది కాసేపటి తర్వాత వాష్ చేస్తే మరకలు మాయమవుతాయి. 
-పురుగులు కుట్టినప్పుడు దురద విసుగు చెందేలా చేస్తుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. కాటు వేసిన చోట కొద్దిగా పేస్ట్ ఐప్లె చేయాలి. ఇది వెంటనే ఉపశమనం కలిగించడమే కాదు.. చర్మం ఎరుపెక్కడాన్ని తగ్గిస్తుంది. 
-ఫోన్ల స్క్రీన్‌పై గీతలు కామన్. వీటిని తొలిగించేందుకు పేస్ట్‌ని ఫోన్ స్క్రీన్ పై ఏర్పడిన పగుళ్లను పూర్తిగా మరమ్మత్తు చేస్తుంది. అయితే పేస్ట్ రాశాక మెత్తని బట్టతో తుడిచేయాలి. 
-కొన్ని రకాల కూరగాయలు కోసినప్పుడు, నాన్‌వెజ్ కడిగినప్పుడు చేతుల నుంచి వచ్చే దుర్వాసన దారుణంగా ఉంటుంది. అప్పుడు టూత్‌పేస్ట్‌ని కొద్దిగా చేతులకు రాసి సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. 
-చిన్న పిల్లలు గోడలపై పెన్సిల్స్, మార్కర్‌లతో గీసేస్తుంటారు. అలాంటి గోడలపై కాస్త పేస్ట్ రాసి కాసేపటి తర్వాత తుడిచేయండి. మీ గోడలు తిరిగి పూర్వ రూపాన్ని సంతరించుకుంటాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.