వేడినీటి స్నానం.. వ్యాయామంతో సమానం...!

చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిదని కొందరు. వేన్నీళ్లతో స్నానం చేస్తే మంచిదని మరికొందరు అంటుంటారు. ఎవరికి తోచినట్టు వాళ్లు అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. ఏది నిజం? ఏది లాభదాయకం?

రోజూ వ్యాయామం చేయనివారు వేడినీటితో స్నానం చేయడం వల్ల కొంతమేరకు వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 2300 మంది మధ్య వయసు వ్యక్తులను 20 యేండ్ల పాటు పరిశీలించి ఈ విషయాలను తేల్చారు. వీరిలో వారానికి ఒకసారి ఆవిరి స్నానం చేసిన వారిలో 20 యేండ్ల కాలంలో సగం మంది మృతి చెందారు. వారంలో రెండు నుంచి మూడుసార్లు ఆవిరి స్నానం చేసిన వారిలో 38శాతం మంది మాత్రమే అదే కాల వ్యవధిలో మృతి చెందారు. ఎక్కువసార్లు ఆవిరి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతర గుండె సమస్యల ముప్పు తగ్గుతున్నట్టు ఈ పరిశోధన ద్వారా వెల్లడైంది. ఆవిరి స్నానంతో రక్త సరఫరా పెరుగడం, రక్తపోటు తగ్గించడం వల్ల ఈ ఫలితాలు కలుగుతున్నట్లు వారు అభిప్రాయపడ్డారు. వేడినీటి స్నానం వల్ల కేలరీ శక్తి కరిగినట్లు గుర్తించారు. అలా కరిగిన కేలరీలు నడకతో సమానమని తేల్చారు. వేడినీటి స్నానం సైక్లింగ్ వ్యాయామంతో సమానం కాకపోయినా నడిచిన దానితో సమానమని అభిప్రాయపడ్డారు.

©2019 APWebNews.com. All Rights Reserved.