నోరు తాజాగా ఉండాలంటే... ?

దంతాలు ఆరోగ్యంగా ఉండటానికీ, నోరు తాజాగా అనిపించడానికీ అస్తమాను మౌత్‌ఫ్రెష్‌నర్లనే వాడాల్సిన అవసరం లేదు. కొన్ని పండ్లూ, పదార్థాలతోనూ వాటిని సాధించొచ్చు. అందుకోసం మనకు ఉపయోగపడేవే ఇవి..

యాపిల్‌: సాయంత్రం పూట ఆకలివేసినప్పుడు బిస్కెట్లు తినేబదులు ఒక యాపిల్‌ని లాగించేయండి. దీనిలోని మాలిక్‌ యాసిడ్‌ పళ్లని శుభ్రం చేస్తుంది. నోరూ తాజాగా ఉంటుంది.

స్ట్రాబెరీ, అనాస: వీటిలో బ్రొమిలీన్‌, విటమిన్‌ సి పోషకాలు ఉంటాయి. ఈ పండ్లని ఎప్పుడు తిన్నా నోరు తాజాగా మారుతుంది.

చీజ్‌, పనీర్‌: వీటిల్లోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌ నోటిలో లాలాజలం ఉత్పత్తికావడానికి సహకరిస్తాయి. నోట్లో తగినంత లాలాజలం ఉన్నప్పుడు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు.

నీరు: ఎన్ని తిన్నా నీటిని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే నీరు నోటిలోని యాసిడ్‌ ఉత్పత్తులను నియంత్రణలో ఉంచుతుంది.

బాదం: బాదంలో దంతాల ఆరోగ్యాన్ని కాపాడే ప్రత్యేక ప్రొటీన్లుంటాయి. పళ్లకి ఎంతో మేలు చేస్తాయి.

పెరుగు: పెరుగులోని మంచి చేసే బ్యాక్టీరియాలు నోటి ఆరోగ్యానికీ ఉపయోగపడతాయి. దీనికి బాదం పలుకులూ, స్ట్రాబెరీ కలుపుకుంటే తాజాదనానికి ఢోకా ఉండదు.

©2019 APWebNews.com. All Rights Reserved.