రాత్రిళ్లు అతిగా మేల్కొంటే..?

చాలామందికి రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. కొంతమందికేమో ఆలస్యంగా పడుకోవడం, త్వరగా నిద్రలేవడం అలవాటు. దీనివల్ల వారు ప్రమాదకర వ్యాధులబారిన పడుతున్నారు.

రాత్రిళ్లు అతిగా మేల్కోవడం వల్ల మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమి వల్ల క్రమేనా అల్జీమర్స్ బారీన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం మేల్కొనే వారిలో అల్జిమర్స్ కారకాలు ఉత్తేజితంగా ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీని వల్ల క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని ఆ పరిశోధనలో తేలింది. ఇలా ప్రతి పదిమంది పురుషుల్లో ముగ్గురు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని అల్జీమర్స్ అసోషియేషన్ తెలిపింది. అలాగే ప్రతి ఐదుగురు స్త్రీలో ఒకరికి ఈ సమస్య ఉందని వెల్లడించింది. ఈ సమస్యకు పరిష్కారం లేదా? అంటే ఉన్నది.ఈ ముప్పు రాకుండా ఉండాలంటే తక్షణమే మీరు నిద్రపోయే సమయాన్ని మార్చుకోవాలి. అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉండకుండా త్వరగా నిద్రపోవాలి. తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. అల్జిమర్స్‌తో బాధపడేవారు నిద్రపోయే ముందు కాఫీ తాగితే త్వరగా నిద్రపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

©2019 APWebNews.com. All Rights Reserved.