పైనాపిల్ జ్యూస్ తో ఉపయోగాలెన్నో..!

ఆరోగ్యం మహాభాగ్యం..రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు మొత్తానికి అవసరమైన విటమిన్ సి ఈ పైనాపిల్ ద్వారా పొందవచ్చు.

పైనాపిల్ ముఖానికి అప్లై చేసే ముందు మొదట చేతి మీద లేదా చెవి వెనుక భాగంలో కాస్త రుద్ది టెస్ట్ చేయాలి. చర్మం మంట, దురద, ఎర్రగా మారడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ముఖానికి రాసుకోవచ్చు. 
* చర్మకాంతిని పొందాలంటే పైనాపిల్ జ్యూస్ సహాయపడుతుంది. ఇందులోని బ్రొమైలిన్ ఎంజైమ్ మొటిమలను నివారించడంతో పాటు చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం ఎలాసిటిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడం వల్ల ముఖంలో ముడుతలు, మచ్చలు లేకుండా స్కిన్‌టోన్ పెరుగుతుంది. 
* ప్రతిరోజూ ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఫెయిర్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు. ఈ జ్యూస్‌ని నీళ్లలో కలిపి ముఖానికి పట్టించి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మకాంతి మరింత పెరుగుతుంది. 
* పైనాపిల్లోని విటమిన్ సి, అమైనో యాసిడ్స్ చర్మంలో కొలెజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. చర్మాన్ని బిగువుగా, పటుత్వాన్ని కోల్పోకుండా చేస్తాయి. అలాగే చర్మం మీది మృతకణాలను తొలిగించడంలో ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. 
* పైనాపిల్ ైస్లెస్ తీసుకొని చర్మం మీద నేరుగా మర్దన చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాదు.. వాటివల్ల మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి. 
* పైనాపిల్‌లో, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మం నవయవ్వనంతో నిగనిగలాడేలా చేస్తాయి. చర్మం యంగ్‌గా కనబడడానికి సహాయపడుతుంది. 

* పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు. 
* కీళ్లనొప్పులు పైనాపిల్ తింటే తగ్గుముఖం పడుతాయి. కారణం.. ఇందులో బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండు. అయితే దీన్ని ఉదయం భోజనం తర్వాత తింటే మంచిది. 
* పైనాపిల్‌లోని ఎంజైమ్ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరితగతిన బాగు చేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లని, ఇతరత్రా గాయాల్ని కూడా ఇది త్వరగా తగ్గిస్తుంది. ఈ రసం తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గుతుంది. 
* ఇందులో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధుల్లో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇది కడుపులోని పురుగుల్ని చంపేస్తుంది. 
* పైనాపిల్‌ను రోజూ రెండు ముక్కల చొప్పున తింటే బెస్ట్. ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. అంటే.. రక్తనాళాల్లోంచి గడ్డల్ని తొలిగించి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. హీమోఫీలియాతో బాధ పడేవాళ్లు మాత్రం వీటిని తినకపోవడమే మంచిది. 
* గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల్ని పైనాపిల్ తగ్గిస్తుంది. ఈ రసాన్ని గొంతులో పోసుకొని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి. 
* వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని విటమిన్ - సి బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది. 
* ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం మంచిది. 
* ఇందులోని పీచుపదార్థం మలబద్దకానికి, ఆడవాళ్లకైతే రుతుక్రమ సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది. 
* పైనాపిల్ డిప్రెషన్, మతిమరుపును తగ్గిస్తుంది. జాండిస్, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే మంచిది.

©2019 APWebNews.com. All Rights Reserved.