గర్బవతులలో నడుము చుట్టూ లేదా తొడలపై మరియు పిరుదులపై ముడతలను తొలగించే ఇంటి చిట్కాలు....!

 

మీ శరీరం పైన వచ్చే ముడతల కలిగే మరకల వలన విశ్రాంతి కూడా సరిగా తీసుకోలేము. మీ చర్మం ఉపరితలం పైన ముడతల వలన వచ్చే మార్పుల వలన చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంటారు.

గర్బ సమయంలో మీ శరీరంలో వచ్చే శారీరక మార్పులు అనగా ఆకృతి, ఇతర మార్పుల వలన మీ చర్మం ముడతలకి గురి అయ్యి మరకలు ఏర్పడతాయి, యుక్త వయస్సు లేదా బరువు పెరగటం వలన కూడా ఇవి ఏర్పడవచ్చు. 98 శాతం గర్బవతులలో నడుము చుట్టూ లేదా తొడలపై మరియు పిరుదులపై ముడతల వలన మరకలు కలుగుతాయి. కానీ కొన్ని మార్గాలను అనుసరించటం వలన చర్మం పైన మడతల వలన వచ్చె మరకలను త్రోలగించవచ్చు.
మసాజ్ మరియు వేడి నీటి స్నానం

చర్మం పైన మడతల వలన వచ్చే మరకలను తొందరగా త్రోలగించటానికి మసాజ్ మరియు వేడి నీటితో స్నానం చేయటం వలన మీరు త్వరిత ఫలితాన్ని పొందుతారు. ఇది చాలా మంచి మార్గం మరియు మరకలను త్రోలగించుటకు సులువైన మార్గం. మసాజ్ మరియు వేడి నీటితో స్నానం చేయటం వలన చర్మ కణాలకు రక్త ప్రసరణ సరిగా జరిగి తిరిగి కణాలు వాటి పూర్వపు స్థితిని సంతరించుకొని మడతలు త్రోలగిపోతాయి. మీ చర్మానికి మసాజ్ చేయటానికి కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్’లను వాడటం వలన చర్మం ఎల్లపుడు తేమబరితంగా ఉంచుతాయి.

రెటీనా ‘A’

‘యూనివర్సిటీ ఆఫ్ మిచ్ గాన్’ వారు జరిపిన పరిశోదనల ఆధారంగా, నూతంగా ఏర్పడిన ముడతల వలన కలిగిన మరకలకు రెటీనా ‘A’ వాడటం వలన త్వరిత ఫలితాన్ని పొందవచ్చు అని తెలిపారు, ఇవి చర్మ ఉపరితలం పైన ఏర్పడే ముడతల వలన ఏర్పడే మరకలను త్రోలగించుటలో శక్తివంతంగా పనిచేస్తాయి అని తెలిపారు. కానీ దీని వలన తెలిసిన దురదృష్టకరమైన వార్తా- ఈ రెటీనా ‘A’ పాత మడతల వలన కలిగిన మరకలను త్రోలగించలేదు అని కనుగొన్నారు.

రెటీనా ‘A’ వాడినపుడు కొన్ని రకాల సూచనలు పాటించాలి అవి- రెటీనా ‘A’ వాడినపుడు తక్కువగా సూర్య కాంతికి బహిర్గతం అవ్వాలి. ఒకవేళ మీరు గర్బవతి కాకున్నను సూర్యకాంతికి బహిర్గతం అవటం వలన శిశు జనన సమయంలో సమస్యలు కలుగవచ్చు.

 

నిమ్మకాయ రసం

మడతల వలన చర్మంపైన కలిగే మరకలను త్రోలగించుటకు మరొక మార్గం కూడా ఉంది; నిమ్మరస వాడకం. నిమ్మరసం సహజసిద్ధమైన ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది ఇది మరకలను సులభంగా త్రోలగిస్తుంది. అంతేకాకుండా నిమ్మకాయ రసం వివిధ రకాల చర్మ సమస్యలకు అనగా గాయాలు, మొటిమలకు, ఇతరేతర వాటికి కూడా మంచి ఔషదంగా పనిచేస్తుంది. తాజా నిమ్మకాయ రసాన్ని తీసుకొని ప్రభావిత ప్రాంతాలలో రాయాలి మరియు నిమ్మకాయ రసంలో చర్మం నానే వరకు అలానే ఉండనివ్వాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉంచిన తరువాత వేడి నీటితో కడిగి వేయాలి. అంతేకాకుండా ఈ నిమ్మకాయ రసానికి దోసకాయ రసాన్ని కూడా కలిపి ప్రభావిత ప్రాంతాలకు పూయండి. ఈ మిశ్రమం ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది.

బంగాళదుంప రసం

మీ చర్మం పైన ముడతల వలన కలిగే మరకలను త్రోలగించటానికి ఇది ఒక్క చక్కటి మార్గం. బంగాళదుంప రసంలో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ వలన చర్మంలోని నిర్జీవ కాణాలు త్రోలగింపబడి, నూతన కణాలు మరియు ఆరోగ్యవంతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మంచి ఫలితం కోసం సాదారణ పరిమాణంలో ఉన్న బంగాళదుంప తీసుకొని, మందమైన ముక్కని కత్తిరించి ముడతల వలన కలిగిన మరకల పైన కొన్ని నిమిషాల పాటు ఉంచండి. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా బంగాళదుంపతో మూసివేయండి. బంగాళదుంప ముక్క ఎండిన తరువాత తీసివేసి గోరు వచ్చని నీటితో కడగండి. ఇలా చేయటం వలన శరీరం పైన ఉండే మడతలు త్రోలగిపోతాయి.

క్యాస్టర్ ఆయిల్

క్యాస్టర్ ఆయిల్ నుండి వచ్చే వాసన మీకు ఇబ్బందిని కలుగచేస్తుంది కావచ్చు కానీ ఇది శరీరం పైన ముడతల వలన కలిగిన మరకలను మాత్రమే కాకుండా, చర్మంపైన ఏర్పడే మచ్చలు, నల్లటి వలయాలు, మోటిమలు, సన్నని గీతలు, పుట్టు మచ్చల వంటి చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ ఆయిల్’ని మరకల పైన 15 నిమిషాల పాటు రుద్దాలి, ఆ తరువాత ఈ ప్రాంతం పైన సన్నని కాటన్ బట్టతో వేడిని అందించే ప్యాడ్ లేదా వేడిని అనించే సాధానాన్ని ఉపయోగించి, 30 నిమిషాల వరకు అలానే ఉండనివ్వాలి. ఇలా ప్రతి రోజు దీనిని అనుసరించటం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు.

మీ చర్మానికి రోజు తేమని అందించండి మరియు ఆలివ్ ఆయిల్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా వివిధ రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మీరు ఫలితం కోసం హోపికతో వచ్చి చూస్తూ, పైన తెలిపిన పద్దతులను పాటించటం వలన తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు.

 

©2018 APWebNews.com. All Rights Reserved.