పట్టు చీరలు ఉతికేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు....!

1. పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమోనియంను వాడాలి.

2. నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి.

3. సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి. చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి.

4. అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి.

5. పట్టు వస్త్రాలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి తడిని తీయాలి. పట్టు చీరలను గదిలో నీడ పట్టున వేలాడ దీసి ఆరబెట్టాలి.

©2018 APWebNews.com. All Rights Reserved.