సౌందర్య చిట్కాలు..!

 

ఎండ కారణంగా చర్మం వడలిపోతే

చెక్కు తీసిన కీరాను మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్లా చేయాలి. దీనికి చెంచాల పచ్చిపాలు కలపాలి. ముందుగా ముఖం బాగా కడుక్కొని, ఈ మిశ్రమాన్ని పలుచటి పొరగా అప్లయ్ చేయాలి. ఒక అరగంట పాటు అలానే ఉంచుకొని చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాకను క్రమం తప్పకుండా వాడితే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

మొటిమలు

ఒక చెంచా స్వచ్చమైన శ్రీగంధం పేస్ట్, ఒక చెంచా చందనం పేస్ట్ మిశ్రమంలా చేసుకొని ముఖంపై రాసుకోవాలి. 20 నిమిషాల సేపు దాన్ని అలానే ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇది ముఖం ఛాయను మెరుగుపర్చడమే గాకుండా మొటిమలను తగ్గిస్తుంది. బొప్పాయి పండును క్రమం తప్పకుండా తినడం వయస్సు పైబడినట్లుగా కన్పించకుండా చేస్తుంది. బొప్పాయి గుజ్జుకు అరచెంచా వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై అప్లయ్ చేయడం నల్లటి మచ్చలను తగ్గిస్తుంది.

జుట్టు రాలడం, చుండ్రు

అరకప్పు తులసి దళాల రసానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ నిమ్మరసం జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెత్తిపై రాసుకొని అరగంట సేపు ఉంచుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇది మీ శిరోజాలను ఆరోగ్యవంతం చేస్తుంది.

నల్లబడడం

నల్ల ద్రాక్ష గుజుకు అర చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం కలపాలి. దీనికే శ్రీగంధం అర చెంచా, ఎర్ర చందనం అర చెంచా తేనె, అర చెంచా పసుపు పొడి కలపాలి. దీన్ని పేస్లా చేసుకొని ముఖంపై లేదా చర్మం నల్లబడిన ప్రాంతంపై రాయాలి. కాసేపటి తరువాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తే ఒంటి ఛాయ మెరుగవుతుంది.

ఇంట్లోనే ఫేషియల్ తయారీ

ఒక క్యారెట్, కీరా చిన్న ముక్క తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. దీనికి అర చెంచా తేనె, రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు కలపాలి. ఈ పేస్ట్లు ముఖంపై, మెడపై రాసుకోవాలి. కాసేపటి తరువాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. దీన్ని క్రమం తప్పకుండా వాడితే చర్మం కాంతివంతమవుతుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.