ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. వారం క్రితం మొహాలిలో పంజాబ్ చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు..

 

ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 206 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు అంబటి రాయుడు (82: 53 బంతుల్లో 3x4, 8x6), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (70 నాటౌట్: 34 బంతుల్లో 1x4, 7x6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 16 పరుగులు అవసరమైన దశలో కోరె అండర్సన్ బౌలింగ్‌కి రాగా.. తొలి రెండు బంతుల్లోనే ఫోర్, సిక్స్ బాదిన డ్వేన్ బ్రావో (14 నాటౌట్: 7 బంతుల్లో 1x4, 1x6) పది పరుగులు రాబట్టగా.. నాలుగో బంతికి ధోనీ కళ్లు చెదిరేరీతిలో సిక్సర్ బాదేశాడు. 

అంతకముందు ఏబీ డివిలియర్స్ (68: 30 బంతుల్లో 2x4, 8x6), డికాక్ (53: 37 బంతుల్లో 1x4, 4x6) మెరుపు అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (18: 15 బంతుల్లో 3x4) ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. 15వ ఓవర్‌ వరకూ ఆకాశమే హద్దుగా చెలరేగి చెన్నై బౌలర్లని ఉతికారేశాడు. డికాక్‌తో కలిసి రెండో వికెట్‌కి డివిలియర్స్ అభేద్యంగా 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బెంగళూరు భారీ స్కోరు చేయగలిగింది. 

ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేవలం 119 పరుగుల లక్ష్యాన్ని అద్భుత బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కాపాడుకుని 31 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (29: 21 బంతుల్లో 5x4), హిట్టర్ యూసఫ్ పఠాన్ (29: 33 బంతుల్లో 2x4, 1x6) పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడటంతో 118 పరుగులకి ఆలౌటైన హైదరాబాద్.. అనంతరం బౌలర్లు సిద్ధార్థ కౌల్ (3/23), రషీద్ ఖాన్ (2/11) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ముంబయిని 87కే కుప్పకూల్చింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (34: 38 బంతుల్లో 4x4), క్రునాల్ పాండ్య (24: 20 బంతుల్లో 4x4) మినహా ఎవరూ మెరుగైన స్కోరు చేయలేకపోయారు. చాలాసేపు క్రీజులో నిలిచిన హిట్టర్ హార్దిక్ పాండ్య (3: 19 బంతుల్లో) ఘోరంగా విఫలమవడం ముంబయి విజయావకాశాల్ని దెబ్బతీసింది. హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో ఆలౌటవగా.. ముంబయి 18.5 ఓవర్లలో కుప్పకూలడం విశేషం. 

ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌‌‌లతో పంజాబ్‌ని గెలిపించిన క్రిస్‌గేల్ అనారోగ్యంతో జట్టుకి దూరమైనా..

 

రాజస్థాన్‌తో జైపూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేజేతులా ఓడింది. 168 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు గౌతమ్ (33 నాటౌట్: 11 బంతుల్లో 4x4, 2x6) సంచలన ఇన్నింగ్స్‌తో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 17.1 ఓవర్లు ముగిసే సమయానికి 125/6తో దాదాపు ముంబయి చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్‌ని గౌతమ్ తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ 15 పరుగులు సమర్పించుకోగా.. తర్వాత ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 18 పరుగులిచ్చాడు. ఈ ఇద్దరూ ఒక్కో నోబాల్ విసరడం కూడా.. రాజస్థాన్‌కి కలిసొచ్చింది. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో హార్దిక్ పాండ్య బౌలింగ్‌ని ఎదుర్కొని ఒక ఫోర్, సిక్స్ బాదేశాడు. ఛేదనలో సంజు శాంసన్ (52: 39 బంతుల్లో 4x4), బెన్‌స్టోక్స్ (40: 27 బంతుల్లో 3x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తాజా సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత రాజస్థాన్ మళ్లీ విజయాన్నిఅందుకుంది. అంతకముందు ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (72: 47 బంతుల్లో 6x4, 3x6), ఇషాన్ కిషన్ (58: 42 బంతుల్లో 4x4, 3x6) అర్ధశతకాలు బాదడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 

ఐపీఎల్ 2018 సీజన్‌లో ఎట్టకేలకి మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాన్ని అందుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హిట్టర్ ఏబీ డివిలియర్స్ (90 నాటౌట్: 39 బంతుల్లో 10x4, 5x6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 

అంతకముందు రిషబ్ పంత్ (85: 48 బంతుల్లో 6x4, 7x6), శ్రేయాస్ అయ్యర్ (52: 31 బంతుల్లో 4x4, 3x6) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు మనన్ వోహ్రా (2), డికాక్ (18) తొందరగా ఔటవడంతో ఒకానొక దశలో 29/2తో కష్టాల్లో నిలిచిన బెంగళూరు జట్టును విరాట్ కోహ్లి (30: 26 బంతుల్లో 2x4, 1x6)తో కలిసి డివిలియర్స్ విజయతీరాలకు చేర్చాడు. అయితే సిక్స్ కొట్టే ప్రయత్నంలో కోహ్లి ఔటవగా.. అనంతరం కోరె అండర్సన్ (15: 13 బంతుల్లో 1x6) డివిలియర్స్‌కి చక్కటి సహకారం అందించాడు. చివర్లో హిట్టింగ్‌కి ప్రయత్నించి అండర్సన్‌ కూడా పెవిలియన్ చేరినా.. మన్‌దీప్ సింగ్ (17 నాటౌట్: 9 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి గెలుపు లాంఛనాన్ని18 ఓవర్లలోనే డివిలియర్స్ పూర్తి చేశాడు. తాజా సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత బెంగళూరుకి ఇది తొలి గెలుపుకాగా.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి వరుసగా రెండో ఓటమి.

గేల్ సెంచరీతో సత్తా చాటాడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన గేల్ ఈ మ్యాచ్‌లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్‌పై ఈ సీజన్లో 150కిపైగా పరుగులు చేసిన తొలి జట్టు పంజాబే కావడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. శ్రాన్ విసిరిన బంతి బలంగా తాకడంతో స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ చేతి వేలికి గాయమైంది. నొప్పితో విలవిల్లాడిన ధావన్ మైదానం వీడాడు. అతడి స్థానంలో కేన్ విలియమ్సన్ క్రీజ్‌లోకి వచ్చాడు.

 సాహా రూపంలో తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్. మోహిత్ శర్మ బౌలింగ్‌లో సాహా క్లీన్ బౌల్డ్. లక్ష్యంగా భారీగా ఉండటంతో యూసుఫ్ పఠాన్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చిన సన్‌రైజర్స్. రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 18 పరుగులు చేసిన సన్‌రైజర్స్. తేలికైన క్యాచ్‌ను వదిలేసిన యువీ. అంతకు ముందు తొలి బంతికే అశ్విన్ క్యాచ్ అందుకోలేకపోవడంతో బతికిపోయిన యూసుఫ్.

మోహిత్ శర్మ బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదికి ఆడుకున్న పఠాన్. 19 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన హిట్టర్. 5 ఓవర్లలో 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్. పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసిన సన్‌రైజర్స్.

* నిలకడగా ఆడుతున్న కెప్టెన్ విలియమ్సన్ (28 బంతుల్లో 36). 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసిన సన్‌రైజర్స్. 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసిన హైదరాబాద్. కొండలా పెరిగిపోతున్న లక్ష్యం. అర్ధ సెంచరీ చేసిన విలియమ్సన్ (40 బంతుల్లో 54) అవుట్. భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ దగ్గర టై చేతికి చిక్కిన విలియమ్సన్. నకుల్ బాల్స్‌తో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెంచుతున్న పంజాబ్ బౌలర్లు. ఆండ్రూ టై బౌలింగ్‌లో హుడా (5) అవుట్.
 

* మనీష్ పాండే హాఫ్ సెంచరీ. 37 బంతుల్లో 50 పరుగులు చేసిన పాండే. 6 బంతుల్లో సన్‌రైజర్స్ విజయానికి 33 పరుగులు అవసరం. ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన షకీబుల్ హసన్. 15 పరుగుల తేడాతో నెగ్గిన పంజాబ్. నాటౌట్‌గా నిలిచిన మనీష్ పాండే (42 బంతుల్లో 57), షకీబుల్ హసన్ (12 బంతుల్లో 24).

 సొంత గడ్డ వరుసగా 9 విజయాలు సాధించిన రాజస్థాన్‌కు నైట్ రైడర్స్ షాకిచ్చింది. తొలుత రాజస్థాన్‌ను 160 పరుగులకే కట్టడి చేసిన రాజస్థాన్.. బ్యాటింగ్‌లోనూ రాణించింది.

ఐపీఎల్‌-11 సీజన్ మొదలై వారం గడుస్తుంది..ఆయన గానీ ముంబయి ఇండియన్స్‌ మాత్రం ఒక్క మ్యాచ్ లో గెలవలేకపోయింది. తాజాగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మీద ఏకంగా 46 పరుగుల తేడాతో గెలిచి పరువు నిలుపుకుంది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి 129 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ చెరో మూడు వికెట్లు తీసిన వేళ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. తొలి ఓవర్లోనే రాయ్ వికెట్ కోల్పోయిన ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లన కోల్పోయింది.ఢిల్లీ బ్యాటింగ్‌లో.. రిషబ్ పంత్ (26 బంతుల్లో 43), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 47) మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. నితీష్ రాణా (35 బంతుల్లో 59), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 41) దూకుడుగా ఆడారు. దీంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించింది.

Page 7 of 9

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.