చెపాక్ వేదికగా చెన్నైతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల భారీ స్కోరు చేసినా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోవడంపై ఆ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పేలవ బౌలింగ్‌తోనే మ్యాచ్‌ని కోల్‌కతా చేజార్చుకుందుని దుయ్యబట్టిన రసెల్.. బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ యార్కర్లు వేయడం నేర్చుకోవాలని హితవు పలికాడు. ఈ మ్యాచ్‌లో రసెల్ (88: 36 బంతుల్లో 1x4, 11x6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో వాట్సన్ (42: 19 బంతుల్లో 3x4, 3x6), రాయుడు (39: 26 బంతుల్లో 3x4, 2x6), శామ్ బిల్లింగ్స్ (56: 23 బంతుల్లో 2x4, 5x6) దూకుడుగా ఆడటంతో 19.5 ఓవర్లలో 205/5తో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. ‘నా కెరీర్‌లో చాలా టీ20 మ్యాచ్‌లు ఆడాను. జట్టు 190, 200 స్కోర్లు చేసినా.. ఇంకా ఓడిపోవడమా..? మ్యాచ్‌ను మెరుగ్గా ఆరంభించడమే కాదు.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వికెట్లను పడగొడుతూ ముగించాలి. ఇక్కడ జట్టులో ఈ బౌలర్ బాగా బౌలింగ్ చేశాడు.. అతను సరిగా చేయలేదు అని నేను చెప్పడం కాదు. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని మాత్రమే చెప్తున్నా. ఈ ఓటమితో యార్కర్లు వేయడంలో కోల్‌కతా బౌలర్ల బలహీనత బయటపడింది. లయ తప్పకుండా బంతి విసరడంపై బౌలర్లు కొంచెం దృష్టి సారిస్తే మంచిది’ అని రసెల్ సూచించాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన రసెల్ 35 పరుగులివ్వగా.. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 17 పరుగుల అవసరమైన దశలో వినయ్ కుమార్ నోబాల్ విసరడంతో పాటు.. దారాళంగా పరుగులివ్వడంతో.. ఒక బంతి మిగిలి ఉండగానే చెన్నై గెలుపొందింది. 

చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. రెండేళ్ల విరామం తర్వాత సొంత గడ్డ మీద తొలి మ్యాచ్ ఆడిన ధోనీ సేన చివరి ఓవర్లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో కోల్‌కతా బౌలర్ వినయ్ కుమార్ ఒత్తిడికి లోనై నోబాల్, వైడ్ విసిరాడు. ఆ ఓవర్లో బ్రావో, జడేజా చెరో సిక్స్ బాదడంతో మరో బంతి మిగిలి ఉండగానే.. చెన్నై విజయాన్ని అందుకుంది. 203 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు షేన్ వాట్సన్ (19 బంతుల్లో 42), అంబటి రాయుడు (26 బంతుల్లో 39) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. వీరిద్దరూ 10 పరుగుల తేడాతో ఔటవడంతో చెన్నై స్కోరు బోర్డు వేగం మందగించింది. రైనా (14), ధోనీ (28 బంతుల్లో 25) ఆశించిన స్థాయిలో రాణించలేదు.చెన్నై విజయానికి 48 బంతుల్లో 100 పరుగులు అవసరమైన స్థితిలో.. శ్యామ్ బిల్లింగ్స్ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 23 బంతుల్లోనే 56 పరుగులు చేసిన బిల్లింగ్స్.. 5 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. విజయానికి 19 పరుగుల దూరంలో బిల్లింగ్స్ అవుటైనప్పటికీ.. బ్రావో (11 నాటౌట్), జడేజా (11 నాటౌట్) లాంఛనం ముగించారు.అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓ దశలో కోల్‌కతా జట్టు 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో ఆండ్రీ రస్సెల్ సిక్సర్ల మోత మోగించడంతో ఆ జట్టు 200 పరుగుల మార్క్ దాటింది. రస్సెల్ కేవలం 36 బంతుల్లోనే 11 సిక్సులు, 1 ఫోర్ సాయంతో 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో వాట్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో వేదిక మార్పు తప్పనిసరైంది. పాక్ క్రికెట్ జట్టుకు తాను ఆతిథ్యం ఇచ్చేది లేదని భారత్ తేల్చి చెప్పింది. దీంతో చేసేదేం లేక వేదిక మారుస్తున్నట్లు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తెలిపింది. ఈ విషయాన్ని ఏసీసీ, పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ ప్రకటించారు. 

కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్ విభాగంలో భారత్ బోణీ చేసింది. పారా పవర్ లిఫ్టర్ సచిన్ చౌధరీ కాంస్య పతకం సాధించాడు. సచిన్‌తోపాటు మరో ముగ్గురు భారత పారా పవర్ లిఫ్టర్లు ఫైనల్ చేరగా.. 181 పాయింట్లతో అతడు మూడో స్థానంలో నిలిచాడు. నైజీరియాకు చెందిన అబ్దులాజీజ్ ఇబ్రహీం స్వర్ణం సాధించగా.. మలేసియాకు చెందిన యీ ఖే జోంగ్ రజతం సాధించాడు. సచిన్ కాంస్య పతకం గెలవడంతో భారత పతకాల సంఖ్య 21కి చేరింది.
 

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. క్రీడల్లో భాగంగా మంగళవారం జరిగిన 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో భారత షూటర్ హీనా సిద్దూ బంగారు పతకాన్ని గెలుపొందింది. రెండు రోజుల క్రితం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ షూటింగ్‌లో రజత పతకం కైవసం చేసుకున్న హీనా సిద్దూ.. కామన్వెల్త్ రికార్డ్స్‌ను బద్దలుకొడుతూ 38 పాయింట్లతో తాజాగా పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది. దీంతో.. కామన్వెల్త్ 2018లో భారత్‌కి రెండు పతకాలు అందించిన తొలి క్రీడాకారిణిగా హీనా సిద్దూ రికార్డుల్లో నిలిచింది.

తెలుగుతేజం శ్రీకాంత్ కిదాంబి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనున్నాడు. వచ్చే గురువారం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించనున్న ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ వరల్డ్ నంబర్ 1గా నిలవనున్నాడు.

ఎపి వెబ్ న్యూస్.కామ్

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మెగా టోర్నీలో ఆరో రోజైన మంగళవారం మలేసియాతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 2-1తేడాతో భారత్ గెలుపొందింది.

Page 5 of 5

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.