ఐపీఎల్‌లో తమ జట్టుకి తిరుగులేదని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి నిరూపించుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ (117 నాటౌట్: 57 బంతుల్లో 11x4, 8x6) మెరుపు శతకం బాదడంతో 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌‌ని ఎగరేసుకుపోయింది.

చివరి అంకానికి చేరిన ఐపీఎల్‌–11లో... రెండో ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో తేల్చుకునేందుకు నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీ పడనున్నాయి.

సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సత్తా చాటింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో 25 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత పొందింది.

ఐపీఎల్‌–11 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్, సూపర్‌ కింగ్స్‌ రెండింటి పయనంపై అనుమానాలు, అనిశ్చితి. అయితే, వాటిని లీగ్‌ ప్రారంభం నుంచే పటాపంచలు చేస్తూ రెండు జట్లు పోటీకి ఎదురొడ్డాయి.

 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తాజా సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరాలన్న కింగ్స్‌ పంజాబ్‌ ఆశలు నెరవేరలేదు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌కు చేరింది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది.

 

వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌కు ఎప్పుడో దూరమై... ప్రేక్షకులకు ఏ కోశానా ఆసక్తి లేకుండా పోయిన వేళ... ఆ జట్టు పటిష్ఠమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి ఆశ్చర్యపర్చింది.

శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడినా హైదరాబాద్‌ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్‌ పరుగులో రాయల్‌ చాలెంజర్స్‌కు మరో కీలక విజయం దక్కింది. గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు అదృష్టం మళ్లీ కలిసొచ్చింది. ఓటమికి చేరువగా వచ్చి కూడా ఆ జట్టు సొంతగడ్డపై విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 3 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. ముందుగా ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (23 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, కృనాల్‌ పాండ్యా (23 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఆండ్రూ టై (4/16) చక్కటి బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (60 బంతుల్లో 94; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోగా, ఆరోన్‌ ఫించ్‌ (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి.  అయితే వీరి భాగస్వామ్యాన్ని విడదీయడంతోనే ముంబై విజయావకాశాలు మెరుగయ్యాయి. 17వ ఓవర్‌లో ఫించ్‌ను బుమ్రా ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో స్టాయినిస్‌ను కూడా బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా రాహుల్ మాత్రం మరో ఎండ్‌లో పోరాడుతూనే ఉన్నాడు. బౌండరీల బౌండరీలు బాదుతూ సెంచరీకి చేరువయ్యాడు. అయితే బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కట్టింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఆఖరి 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన పరిస్థితి. క్రీజులో యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్ ఉన్నారు. మెక్‌క్లెనాగన్ బంతిని అందుకున్నాడు. 

Page 4 of 9

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.