బలహీనమైన ఢిల్లీ, రాజస్తాన్‌ మధ్య మ్యాచేగా? అంటూ నిర్వేదంలో ఉన్న అభిమానులకు వారి అభిప్రాయం తప్పని చెప్పేలా ఈ రెండు జట్లు చక్కని టి20 క్రికెట్‌ విందు అందించాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఢిల్లీ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్‌ వేశాక వర్షం కారణంగా ఆట దాదాపు గంటన్నర ఆలస్యం కావడంతో 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... ఓపెనర్‌ పృథ్వీ షా (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల విధ్వంసక ఆటతో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 17.1 ఓవర్‌ వద్ద ఉండగా మళ్లీ వాన పడటంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151గా నిర్దేశించారు. ఓపెనర్లు జాస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), షార్ట్‌ (25 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు)ల మెరుపులతో రాజస్తాన్‌ ఓ దశలో గెలిచేలా కనిపించింది. అయితే వీరు వెనుదిరిగాక హిట్టింగ్‌ చేసేవారు లేక వెనుకబడిపోయింది. బౌల్ట్‌ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... కృష్ణప్ప గౌతమ్‌ (6 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఈసారి దానిని సాధించడంలో విఫలమయ్యాడు

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తీవ్ర ఒత్తిడి మధ్య ఈ మ్యాచ్‌లో బరిలో దిగిన కోహ్లి సేన.. ముంబైపై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మళ్లీ పుంజుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ క్రిస్‌లిన్ (62 నాటౌట్: 52 బంతుల్లో 7x4, 1x6) అజేయ అర్ధశతకం బాదడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకముందు కెప్టెన్ విరాట్ కోహ్లి (68 నాటౌట్: 44 బంతుల్లో 5x4, 3x6) అర్ధశతకం సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా.. ఛేదనలో క్రిస్‌లిన్‌తో పాటు రాబిన్ ఉతప్ప (36: 21 బంతుల్లో 3x4, 3x6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (23: 10 బంతుల్లో 2x4, 1x6) మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా జట్టు మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 176/4తో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా చేతిలో బెంగళూరు జట్టు ఓడిపోవడం ఈ సీజన్‌లో ఇది రెండోసారి. ఏప్రిల్ 8న జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 4 వికెట్ల తేడాతో బెంగళూరుని కోల్‌కతా ఓడించింది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ మళ్లీ పుంజుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (56 నాటౌట్ : 33 బంతుల్లో 6x4, 2x6), ఓపెనర్ ఎవిన్ లావిస్ (47: 43 బంతుల్లో 3x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబయి ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివర్లో ముంబయి విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉన్న దశలో బౌలింగ్‌కి వచ్చిన శార్ధూల్ ఠాకూర్ ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 0, 4 బాదేసిన రోహిత్ శర్మ చెన్నైకి మ్యాచ్‌ని దూరం చేసేశాడు. టోర్నీలో రెండు వరుస ఓటముల తర్వాత మళ్లీ ముంబయి గెలవగా.. మూడు వరుస విజయాల అనంతరం చెన్నై ఓడింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ముంబయిని ఆఖరి ఓవర్‌లో చెన్నై ఓడించిన విషయం తెలిసిందే. చెన్నై సొంతగడ్డ (కావేరి జల వివాదం, ఆందోళనల కారణంగా చెపాక్‌ నుంచి మార్చారు) పుణెలో ధోనీ సేనకి ఇదే తొలి ఓటమి. తొలుత చెన్నై జట్టు సురేశ్ రైనా (75 నాటౌట్: 47 బంతుల్లో 6x4, 4x6), అంబటి రాయుడు (46: 35 బంతుల్లో 2x4, 4x6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (44: 34 బంతుల్లో 5x4, 1x6), ఎవిన్ లావిస్ తొలి వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యంతో ముంబయికి శుభారంభమివ్వగా.. చివర్లో హార్దిక్ పాండ్య (16 నాటౌట్: 8 బంతుల్లో 1x6, 1x6)తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 173/2తో గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు. 

కెప్టెన్సీ మార్పు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అదృష్టం తెచ్చిపెట్టినట్లుంది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 55 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 93 నాటౌట్‌; 3 ఫోర్లు, 10 సిక్సర్లు) భీకర బ్యాటింగ్, పృథ్వీ షా (44 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌కు మున్రో (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు కూడా తోడయ్యాయి. ఆ తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. రసెల్‌ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

 

 
ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. వారం క్రితం మొహాలిలో పంజాబ్ చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు..

 

ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 206 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు అంబటి రాయుడు (82: 53 బంతుల్లో 3x4, 8x6), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (70 నాటౌట్: 34 బంతుల్లో 1x4, 7x6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 16 పరుగులు అవసరమైన దశలో కోరె అండర్సన్ బౌలింగ్‌కి రాగా.. తొలి రెండు బంతుల్లోనే ఫోర్, సిక్స్ బాదిన డ్వేన్ బ్రావో (14 నాటౌట్: 7 బంతుల్లో 1x4, 1x6) పది పరుగులు రాబట్టగా.. నాలుగో బంతికి ధోనీ కళ్లు చెదిరేరీతిలో సిక్సర్ బాదేశాడు. 

అంతకముందు ఏబీ డివిలియర్స్ (68: 30 బంతుల్లో 2x4, 8x6), డికాక్ (53: 37 బంతుల్లో 1x4, 4x6) మెరుపు అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (18: 15 బంతుల్లో 3x4) ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. 15వ ఓవర్‌ వరకూ ఆకాశమే హద్దుగా చెలరేగి చెన్నై బౌలర్లని ఉతికారేశాడు. డికాక్‌తో కలిసి రెండో వికెట్‌కి డివిలియర్స్ అభేద్యంగా 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బెంగళూరు భారీ స్కోరు చేయగలిగింది. 

ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేవలం 119 పరుగుల లక్ష్యాన్ని అద్భుత బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కాపాడుకుని 31 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (29: 21 బంతుల్లో 5x4), హిట్టర్ యూసఫ్ పఠాన్ (29: 33 బంతుల్లో 2x4, 1x6) పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడటంతో 118 పరుగులకి ఆలౌటైన హైదరాబాద్.. అనంతరం బౌలర్లు సిద్ధార్థ కౌల్ (3/23), రషీద్ ఖాన్ (2/11) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ముంబయిని 87కే కుప్పకూల్చింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (34: 38 బంతుల్లో 4x4), క్రునాల్ పాండ్య (24: 20 బంతుల్లో 4x4) మినహా ఎవరూ మెరుగైన స్కోరు చేయలేకపోయారు. చాలాసేపు క్రీజులో నిలిచిన హిట్టర్ హార్దిక్ పాండ్య (3: 19 బంతుల్లో) ఘోరంగా విఫలమవడం ముంబయి విజయావకాశాల్ని దెబ్బతీసింది. హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో ఆలౌటవగా.. ముంబయి 18.5 ఓవర్లలో కుప్పకూలడం విశేషం. 

ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌‌‌లతో పంజాబ్‌ని గెలిపించిన క్రిస్‌గేల్ అనారోగ్యంతో జట్టుకి దూరమైనా..

 

రాజస్థాన్‌తో జైపూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేజేతులా ఓడింది. 168 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు గౌతమ్ (33 నాటౌట్: 11 బంతుల్లో 4x4, 2x6) సంచలన ఇన్నింగ్స్‌తో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 17.1 ఓవర్లు ముగిసే సమయానికి 125/6తో దాదాపు ముంబయి చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్‌ని గౌతమ్ తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ 15 పరుగులు సమర్పించుకోగా.. తర్వాత ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 18 పరుగులిచ్చాడు. ఈ ఇద్దరూ ఒక్కో నోబాల్ విసరడం కూడా.. రాజస్థాన్‌కి కలిసొచ్చింది. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో హార్దిక్ పాండ్య బౌలింగ్‌ని ఎదుర్కొని ఒక ఫోర్, సిక్స్ బాదేశాడు. ఛేదనలో సంజు శాంసన్ (52: 39 బంతుల్లో 4x4), బెన్‌స్టోక్స్ (40: 27 బంతుల్లో 3x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తాజా సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత రాజస్థాన్ మళ్లీ విజయాన్నిఅందుకుంది. అంతకముందు ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (72: 47 బంతుల్లో 6x4, 3x6), ఇషాన్ కిషన్ (58: 42 బంతుల్లో 4x4, 3x6) అర్ధశతకాలు బాదడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 

Page 3 of 5

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.