ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. టోర్నీలో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ (95 నాటౌట్: 60 బంతుల్లో 11x4, 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయంతో సగర్వంగా ప్లేఆఫ్‌ బెర్తుని ఖాయం చేసుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా విఫలమైనా..

ఐపీఎల్ 2018 సీజన్‌లో వరుసగా రెండోసారి కూడా ముంబయి ఇండియన్స్‌తో చేతిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ చిత్తుగా ఓడింది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో యువ హిట్టర్ ఇషాన్ కిషన్ (62: 21 బంతుల్లో 5x4, 6x6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో తడబడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 18.1 ఓవర్లలో108 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో క్రిస్‌లిన్ (21), రాబిన్ ఉతప్ప (14), నితీశ్ రానా (21), ఆండ్రీ రసెల్ (2), దినేశ్ కార్తీక్ (5) ఒత్తిడిలో చిత్తయ్యారు. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ఆరంభంలో క్రిస్‌లిన్, మిడిల్ ఓవర్లలో కార్తీక్ రనౌటవడం కోల్‌కతా విజయావకాశాల్ని దెబ్బతీసింది. టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని అందుకున్న ముంబయి ఇండియన్స్‌ జట్టు ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోగా.. కోల్‌కతా మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవాల్సిన సంకట స్థితిలో పడిపోయింది. సీజన్‌లో ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. మ్యాచ్ ఆరంభంలోనే ఎవిన్ లూవిస్ (18) వికెట్ చేజారినా.. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (36: 32 బంతుల్లో 5x4, 1x6) పవర్ ప్లేలో బ్యాట్ ఝళిపించాడు. అయితే కీలక సమయంలో అతను ఔటైనా.. మిడిల్ ఓవర్లలో ఇషాన్ కిషన్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (36: 31 బంతుల్లో 2x4, 1x6), హార్దిక్ పాండ్య (19: 13 బంతుల్లో 2x6) దూకుడుగా ఆడటంతో ముంబయి భారీ స్కోరుకి బాటలు పడ్డాయి. ముఖ్యంగా ఒకే ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6 బాదిన ఇషాన్ కిషన్.. 17 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. చివర్లో రోహిత్, హార్దిక్, బెన్ కటింగ్ (24: 8 బంతుల్లో 1x4, 3x6) సిక్సర్ల మోత మోగించేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన పీయూస్ చావ్లా బౌలింగ్‌లో బెన్ కటింగ్ తొలి మూడు బంతుల్ని 6, 6, 4గా మలచగా.. ఆఖరి బంతిని క్రునాల్ పాండ్య సిక్స్‌గా తరలించాడు. దీంతో 20వ ఓవర్‌లో ముంబయి 22 పరుగుల్ని పిండుకుంది

ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకుంది. రెండు రోజుల క్రితం పంజాబ్‌ చేతిలో ఓడిన రాజస్థాన్.. మంగళవారం రాత్రి జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలుపొంది ఓటమికి బదులు తీర్చుకుంది. టోర్నీలో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. ఓపెనర్ జోస్ బట్లర్ (82: 58 బంతుల్లో 9x4, 1x6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కేఎల్ రాహుల్ (95 నాటౌట్: 70 బంతుల్లో 11x4, 2x6) ఆఖరి బంతి వరకూ అజేయ పోరాటం చేసినా పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు. ఆరంభంలోనే క్రిస్‌గేల్ (1), అశ్విన్ (0) కరుణ్ నాయర్ (3) వికెట్లను చేజార్చుకోవడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. ఒక ఎండ్‌లో కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేసినా.. అతనికి సహకారం అందించేవారు కరవయ్యారు. అక్షదీప్ (9), మనోజ్ తివారి (7), అక్షర్ పటేల్ (9) కీలక సమయంలో ఔటవడంతో చివరికి పంజాబ్ 143/7కే పరిమితమైంది. టోర్నీలో వరుసగా మూడు ఓటముల తర్వాత మళ్లీ రాజస్థాన్ జట్టు గెలుపొందగా.. పంజాబ్‌కు ఇది మొత్తంగా నాలుగో ఓటమి. 

అంతకముందు రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానె (9) వైఫల్యాల బాట కొనసాగించగా.. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన గౌతమ్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో కాసేపు ఇన్నింగ్స్ నడిపించిన సంజు శాంసన్ (22: 18 బంతుల్లో 1x4, 1x6) కీలక సమయంలో ఔటవడంతో ఆ జట్టు తడబడింది. అయితే.. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. జోస్ బట్లర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పవర్‌ ప్లేలో స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించిన ఈ ఓపెనర్.. మిడిల్ ఓవర్లలో ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఈ దశలో జట్టు స్కోరు 132 వద్ద హిట్టింగ్‌‌కి ప్రయత్నిస్తూ బట్లర్ స్టంపౌటవగా.. అనంతరం వచ్చిన స్టువర్ట్ బిన్నీ (11: 7 బంతుల్లో 1x6) సిక్స్‌తో ఊపు మీద కనిపించినా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. చివర్లో బెన్‌స్టోక్స్ (14: 11 బంతుల్లో 1x4) ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో రాజస్థాన్‌ తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ రెండు, స్టాయినిస్ ఒక వికెట్ తీశారు. 

స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ ఊహించని విధంగా విజయాలు అందుకునే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి అభిమానులకు అదిరిపోయే విక్టరీని అందించింది. తప్ప గెలవాల్సిన స్థితిలో బెంగళూరు మరోసారి చేతులెత్తేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో గెలిచింది. భువనేశ్వర్ కుమార్ ఆఖరి ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీయడంతో సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ సాధించింది. 
 అంతకుముందు టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి.. హైదరాబాద్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. కెప్టెన్ విలియమ్సన్ (39 బంతుల్లో 56), షకీబుల్ హసన్ (32 బంతుల్లో 35) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 146 పరుగులు చేసింది. ఓపెనర్లు హేల్స్ (5), శిఖర్ ధావన్ (13), మనీష్ పాండే(5) విఫలమైనా షకీబుల్ హసన్‌తో కలసి విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో విలియమ్సన్, షకీబుల్ హసన్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఆ తరవాత యూసఫ్ పఠాన్ (12), సాహా (8), రషిద్ ఖాన్(1), సిద్ధార్థ్ కౌల్(1), సందీప్ శర్మ(0) తక్కువ స్కోర్లకే పరిమితమవడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 146 పరుగులకు ఆలౌటైంది.
కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ అభివాదంలక్ష్య ఛేదనలో బెంగళూరుకు ఆదిలోనే దెబ్బ తగిలింది. షకీబుల్ హసన్ వేసిన మూడో ఓవర్‌లో పార్థీవ్ పటేల్ ఔటయ్యాడు. ఆ తరవాత సందీప్ శర్మ వేసిన 8వ ఓవర్‌లో వోహ్రా (8) బౌల్డయ్యాడు. ఇక జోరుమీదున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ(39)ని షకీబుల్ హసన్ ఔట్ చేశాడు. షార్ట్ థర్డ్ మ్యాన్‌ వద్ద పఠాన్ ఒంటి చేత్తో క్యాచ్‌ను అందుకోవడంతో కోహ్లి పెవిలియన్‌కు చేరాడు. ఆ తరవాత ఓవర్‌లోనే ఏబీ డివిలియర్స్‌(5)ను రషీద్ ఖాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 12వ ఓవర్‌లో మొయిన్ అలీ(10)ని కౌల్ ఔట్ చేశాడు. ఆ తరవాత మన్‌దీప్ సింగ్ (21 నాటౌట్), డిగ్రాండ్‌హోమ్ (33) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశాడు. ఆఖరి బంతికి డిగ్రాండ్‌హోమ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బెంగళూరు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది ఎనిమిదో విజయం కాగా, బెంగళూరుకు ఇది ఏడో ఓటమి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ విసిరిన 153 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ 18.4 ఓవర్లలో ఛేదించింది. దాంతో వరుసగా రెండు ఓటముల తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ విజయాన్ని అందుకుంది. కింగ్స్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ (84 నాటౌట్‌;54 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌(31), స్టోనిస్‌(23 నాటౌట్‌)లు ఆకట్టుకున్నారు.

అంతకుముందు రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రాజస్తాన్‌ ఆటగాళ్లలో జాస్‌ బట్లర్‌(51;39 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆ తర్వాత సంజూ శాంసన్‌(28;23 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌), శ్రేయస్‌ గోపాల్‌(24‌)లు ఫర్వాలేదనిపించారు. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ ఆరంభంలోనే డీ ఆర్సీ షార్ట్‌(2) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో జాస్‌ బట్లర్‌కు కెప్టెన్‌ రహానే జత కలిశాడు. కాగా, రహానే(5) కూడా వైఫల్యం చెందడంతో రాజస్తాన్‌ 35 పరుగులకే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆపై కాసేపు బట్లర్‌-శాంసన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 49 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్‌ ఔటయ్యాడు. అటు తర్వాత రాజస్తాన్‌ స్వల విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. చివర్లో శ్రేయస్‌ గోపాల్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో  కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, అక్షర్‌ పటేల్‌లకు తలో వికెట్‌ లభించింది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ని 163 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ జట్టు..

ముంబయి ఇండియన్స్‌ సరైన సమయంలో సత్తా చాటింది. పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 42 బంతుల్లో 6×4, 3×6), కృనాల్‌ పాండ్య (31 నాటౌట్‌; 12 బంతుల్లో 4×4, 2×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు క్రిస్‌ గేల్‌ (50; 40 బంతుల్లో 6×4, 2×6), స్టాయినిస్‌ (29 నాటౌట్‌; 15 బంతుల్లో 2×4, 2×6) రాణించడంతో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. బుమ్రా (1/19), మయాంక్‌ మార్కండే (1/29) పంజాబ్‌కు కళ్లెం వేశారు. ఛేదనలో ముంబయికి సూర్యకుమార్‌ మంచి ఆరంభాన్నిచ్చాడు. లూయిస్‌ (10) విఫలమైనా.. అతను చెలరేగిపోయాడు. తనే ఎక్కువగా స్ట్రైక్‌ తీసుకుంటూ.. చక్కటి షాట్లు ఆడుతూ ఛేదనను నడిపించాడు. క్రీజులో కుదురుకున్నాక ఇషాన్‌ కిషన్‌ (25; 19 బంతుల్లో 3×6) కూడా మెరుపు సిక్సర్లతో అలరించాడు. సూర్యకుమార్‌ను ఔట్‌ చేయడం ద్వారా స్టాయినిస్‌ ఈ జోడీని విడదీశాడు. ముజీబ్‌ రెహ్మాన్‌ ప్రమాదకరంగా మారుతున్న ఇషాన్‌ను ఔట్‌ చేయడమే కాక పరుగులు కట్టడి చేసి ముంబయిపై ఒత్తిడి పెంచాడు. 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఐతే కృనాల్‌ పాండ్య.. ముజీబ్‌ సహా వరుసగా పంజాబ్‌ బౌలర్లను ఉతికారేస్తూ ముంబయికి సునాయాస విజయాన్నందించాడు. రోహిత్‌ (24 నాటౌట్‌) కూడా సత్తా చాటడంతో ఒక ఓవర్‌ ఉండగానే ముంబయి పని పూర్తయింది.

 అంతకుముందు పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఒడుదొడుకులతో సాగింది. ఓపెనర్లు గేల్‌, రాహుల్‌ (24) ఆ జట్టుకు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. మరీ విధ్వంసకరంగా ఆడకపోయినా వీలు చిక్కినపుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఏడో ఓవర్లో రాహుల్‌ ఔటయ్యే సమయానికి స్కోరు 54. గేల్‌ కొన్ని కళ్లు చెదిరే షాట్లతో అభిమానుల్ని అలరించాడు. మెక్లెనగన్‌ బౌలింగ్‌లో అతనాడిని పుల్‌ షాట్‌కు బంతి స్టేడియం అవతల పడటం విశేషం. ఐతే గేల్‌ అప్పుడప్పుడూ  షాట్లు ఆడినా.. చాలా బంతులే వృథా చేశాడు. అతను 40 బంతుల్లో 50 చేసి ఔటయ్యాడు. రాహుల్‌ ఔటయ్యాక వచ్చిన యువరాజ్‌ (14) బాగా ఇబ్బంది పడ్డాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోయాడు. దీంతో రన్‌రేట్‌ 8 లోపే సాగింది. గేల్‌, యువీ వరుస ఓవర్లలో వెనుదిరగ్గా.. కరుణ్‌ నాయర్‌ (12 బంతుల్లో 23; 1×4, 2×6) ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు. ముంబయి బౌలర్లు కరుణ్‌, అక్షర్‌ పటేల్‌ (13)లను స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేయడమే కాక.. చివరి ఓవర్లలో చక్కగా బౌలింగ్‌ చేసి పంజాబ్‌ను కట్టడి చేశారు. ఐతే హార్దిక్‌ వేసిన చివరి ఓవర్లో స్టాయినిస్‌ (29 నాటౌట్‌) రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు రాబట్టడంతో ముంబయి ముందు కింగ్స్‌ మెరుగైన లక్ష్యాన్నే నిలిపింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ షాకిచ్చింది. గురువారం సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చెన్నైను భారీ స్కోరు చేయకుండా నియంత్రించిన కేకేఆర్‌.. ఆపై లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. చెన్నై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 17 .4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. దాంతో అంతకుముందు చెన్నై చేతిలో ఎదురైన ఓటమికి కోల్‌కతా ప‍్రతీకారం తీర్చుకుంది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మాన్‌ గిల్‌(57నాటౌట్; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు‌), దినేశ్‌ కార్తీక్‌(45 నాటౌట్; 7ఫోర్లు,1 సిక్స్‌‌)లు రాణించగా, సునీల్‌ నరైన్‌(32; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ను షేన్‌ వాట్సన్‌, డు ప్లెసిస్‌లు ధాటిగా ఆరంభించారు. అయితే డుప్లెసిస్‌(27;15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వాట్సన్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 43 పరుగులు జత చేసిన తర్వాత వాట్సన్‌(36; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.ఆపై మరో 10 పరుగుల వ్యవధిలో రైనా(31;26 బంతుల్లో 4 ఫోర్లు) సైతం పెవిలియన్‌ చేరడంతో 101 పరుగుల వద్ద చెన్నై మూడో వికెట్‌ను నష్టపోయింది. ఇక అంబటి రాయుడు(21;17 బంతుల్లో 4 ఫోర్లు) స్వల్ప స్కోరుకే పరిమితం కావడంతో చెన్నై ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. ఈ తరుణంలో ఎంఎస్‌ ధోని- రవీంద్ర జడేజాల జోడి ఆదుకునే యత్నం చేసింది. ఈ జోడి ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం సాధించింది. జడేజా(12) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ధోని(43 నాటౌట్‌; 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లు) మరోసారి మెరిశాడు. దాంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌,  పీయూష్‌ చావ్లాలు తలో రెండు వికెట్లు సాధించగా, కుల్దీప్‌ యాదవ్‌ వికెట్‌ సాధించాడు.

బలహీనమైన ఢిల్లీ, రాజస్తాన్‌ మధ్య మ్యాచేగా? అంటూ నిర్వేదంలో ఉన్న అభిమానులకు వారి అభిప్రాయం తప్పని చెప్పేలా ఈ రెండు జట్లు చక్కని టి20 క్రికెట్‌ విందు అందించాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఢిల్లీ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్‌ వేశాక వర్షం కారణంగా ఆట దాదాపు గంటన్నర ఆలస్యం కావడంతో 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... ఓపెనర్‌ పృథ్వీ షా (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల విధ్వంసక ఆటతో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 17.1 ఓవర్‌ వద్ద ఉండగా మళ్లీ వాన పడటంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151గా నిర్దేశించారు. ఓపెనర్లు జాస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), షార్ట్‌ (25 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు)ల మెరుపులతో రాజస్తాన్‌ ఓ దశలో గెలిచేలా కనిపించింది. అయితే వీరు వెనుదిరిగాక హిట్టింగ్‌ చేసేవారు లేక వెనుకబడిపోయింది. బౌల్ట్‌ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... కృష్ణప్ప గౌతమ్‌ (6 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఈసారి దానిని సాధించడంలో విఫలమయ్యాడు

Page 2 of 5

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.