ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపు..!

బలహీనమైన ఢిల్లీ, రాజస్తాన్‌ మధ్య మ్యాచేగా? అంటూ నిర్వేదంలో ఉన్న అభిమానులకు వారి అభిప్రాయం తప్పని చెప్పేలా ఈ రెండు జట్లు చక్కని టి20 క్రికెట్‌ విందు అందించాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఢిల్లీ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్‌ వేశాక వర్షం కారణంగా ఆట దాదాపు గంటన్నర ఆలస్యం కావడంతో 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... ఓపెనర్‌ పృథ్వీ షా (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల విధ్వంసక ఆటతో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 17.1 ఓవర్‌ వద్ద ఉండగా మళ్లీ వాన పడటంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151గా నిర్దేశించారు. ఓపెనర్లు జాస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), షార్ట్‌ (25 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు)ల మెరుపులతో రాజస్తాన్‌ ఓ దశలో గెలిచేలా కనిపించింది. అయితే వీరు వెనుదిరిగాక హిట్టింగ్‌ చేసేవారు లేక వెనుకబడిపోయింది. బౌల్ట్‌ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... కృష్ణప్ప గౌతమ్‌ (6 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఈసారి దానిని సాధించడంలో విఫలమయ్యాడు

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.