ఎట్టకేలకి ఢిల్లీ గెలిచింది..!

కెప్టెన్సీ మార్పు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అదృష్టం తెచ్చిపెట్టినట్లుంది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 55 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 93 నాటౌట్‌; 3 ఫోర్లు, 10 సిక్సర్లు) భీకర బ్యాటింగ్, పృథ్వీ షా (44 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌కు మున్రో (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు కూడా తోడయ్యాయి. ఆ తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. రసెల్‌ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.