కింగ్స్‌ పంజాబ్‌ జోరు..!

ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌‌‌లతో పంజాబ్‌ని గెలిపించిన క్రిస్‌గేల్ అనారోగ్యంతో జట్టుకి దూరమైనా..

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో సోమవారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. 144 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ జట్టు విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో ఒక సిక్స్, ఫోర్ బాదిన శ్రేయాస్ అయ్యర్ (57: 45 బంతుల్లో 5x4, 1x6) మ్యాచ్‌ని ఉత్కంఠగా మార్చేశాడు. అయితే.. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిరాగా.. పంజాబ్ యువ స్పిన్నర్ ముజీబ్ తెలివైన బంతితో శ్రేయాస్‌ని ఔట్ చేసి.. జట్టుని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. సిక్స్ కోసం ప్రయత్నించిన శ్రేయాస్ బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్ అరోన్ ఫించ్ చేతికి చిక్కాడు. వరుసగా నాలుగో విజయం అందుకున్న పంజాబ్ పాయింట్ల పట్టికలో నెం.1 స్థానానికి ఎగబాకగా.. హాట్రిక్ ఓటములతో ఢిల్లీ చివరి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.