ఉత్కంఠ పోరులో.. సన్‌రైజర్స్ గెలుపు ...!

 

 సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్‌ వికెట్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌  ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఎవిన్‌ లూయీస్‌ (17 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్‌ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు స్కోరులో తలో చేయి వేశారు. సందీప్, కౌల్, స్టాన్‌లేక్‌ తలా 2 వికెట్లు పడగొట్టగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్ర మే ఇచ్చి ఒక వికెట్‌ తీయడం విశేషం. అనం è రం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధావన్‌ (28 బంతుల్లో 45; 8 ఫోర్లు) మరోసారి టాప్‌ స్కోరర్‌గా నిలవగా... దీపక్‌ హుడా (25 బంతుల్లో 32 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. మయాంక్‌ మార్కండే 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. శనివారం కోల్‌కతాలో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడుతుంది.  

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.