కామన్వెల్త్ గేమ్స్‌లో.. భారత రెజర్ల పతకాల వేట ...!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌ భారత రెజర్లు పతకాల వేటని మొదలెట్టారు. 57 కేజీల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో గురువారం పోటీపడిన రెజ్లర్ రాహుల్ అవేర్ పసిడి పతకం గెలుపొందగా.. అతని కంటే కొద్ది నిమిషాల ముందు 53 కేజీల మహిళల ఫ్రీ స్టైల్‌లో పోటీపడి బబిత కుమారి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. బంగారు పతకం కోసం.. కెనడియన్ రెజ్లర్‌ స్టీవెన్‌తో పోటీపడిన రాహుల్ 15-7తో అలవోక విజయాన్ని అందుకున్నాడు. మరోవైపు కెనడియన్‌కే చెందిన దైనా వీకర్‌తో పోటీపడిన బబితా కుమారి 2-5 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా రెజర్లు గెలిచిన పతకాలతో కలిపి భారత్ పతకాల సంఖ్య 27కి చేరాయి.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.