చెన్నైలో IPL మ్యాచ్‌ల రద్దు..!

కావేరీ నిరసనల కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని చెన్నైలోని చెపాక్ స్టేడియం కోల్పోయింది. కావేరీ వివాదం తేలేంత వరకూ చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను బహిష్కరించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. రెండేళ్ల విరామం తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌కు నిరసనకారులు ఆటంకాలు కల్పించారు. ఆటగాళ్లపై బూట్లు విసిరారు. దీంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో ఆడాల్సిన మ్యాచ్‌లను చెన్నై బదులు ఏ నగరంలో నిర్వహిస్తారనే విషయం ఆసక్తి రేపుతోంది. కాగా బీసీసీఐ ఇప్పటికే నాలుగు నగరాలను ఎంపిక చేసిందని సమాచారం.చెన్నై సూపర్ కింగ్స్ హోం మ్యాచ్‌లకు ఆతిథ్యం విషయంలో విశాఖపట్నం ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ల నిర్వహణ కోసం విశాఖ, తిరువనంతపురం, పుణే, రాజ్‌కోట్ నగరాలు సిద్ధంగా ఉన్నాయని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ హెడ్ వినోద్ రాయ్ తెలిపారు. మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహించాలనే విషయంలో తుది నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానిదేనని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.