కామన్వెల్త్.. కాంస్యంతో మెరిసిన పవర్ పారాలిఫ్టర్.. సచిన్ చౌదరి.

కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్ విభాగంలో భారత్ బోణీ చేసింది. పారా పవర్ లిఫ్టర్ సచిన్ చౌధరీ కాంస్య పతకం సాధించాడు. సచిన్‌తోపాటు మరో ముగ్గురు భారత పారా పవర్ లిఫ్టర్లు ఫైనల్ చేరగా.. 181 పాయింట్లతో అతడు మూడో స్థానంలో నిలిచాడు. నైజీరియాకు చెందిన అబ్దులాజీజ్ ఇబ్రహీం స్వర్ణం సాధించగా.. మలేసియాకు చెందిన యీ ఖే జోంగ్ రజతం సాధించాడు. సచిన్ కాంస్య పతకం గెలవడంతో భారత పతకాల సంఖ్య 21కి చేరింది.
 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.