కామన్వెల్త్‌లో సెమీస్ చేరిన భారత హాకీ జట్టు

ఎపి వెబ్ న్యూస్.కామ్

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మెగా టోర్నీలో ఆరో రోజైన మంగళవారం మలేసియాతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 2-1తేడాతో భారత్ గెలుపొందింది.

 మలేసియాతో ఉత్కంఠగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆట ఆరంభంలోనే హర్మన్‌ప్రీత్ సింగ్ సూపర్ గోల్‌తో భారత్‌కి శుభారంభమిచ్చాడు. 3వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ గోల్ సాధించగా.. మలేసియా 16వ నిమిషంలో గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 1-1‌తో సమం చేసింది. అనంతరం ఇరు జట్లూ ఆధిపత్యం కోసం పోటాపోటీగా గోల్ పోస్టులపై దాడికి దిగాయి. ఎట్టకేలకి 44వ నిమిషంలో మరోసారి హర్మన్‌ప్రీత్ సింగ్ కళ్లుచెదిరే గోల్‌తో భారత్‌ని 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మలేసియా చివరి వరకూ గోల్ కోసం ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.