జైత్రయాత్రకు బ్రేక్...!

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ పేలవమైన ఆట కారణంగా పరాజయం పాలైంది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మరోసారి తమ ఆల్‌రౌండ్‌ ప్రతిభను చాటుకోవటం సిరీస్‌ వారి సొంతమైంది.రూట్‌-మోర్గాన్‌ ఫటాఫట్‌..: 257పరుగులు..

భారత్‌ ఇచ్చిన టార్గెట్‌ కనుగుణంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్‌ బెయిర్‌స్టో మెరుపు వేగంతో ఓపెనింగ్‌ ప్రారంభించాడు. వరుస బౌండరీలు బాదుతూ చెలరేగిపోయాడు. శార్ధూల్‌ వేసిన ఐదో ఓవర్‌ నాలుగో బంతికి బెయిర్‌స్టో రైనాకు క్యాచ్‌ ఇచ్చి ఓటయ్యాడు. అపుడు అతను కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అనంతరం 10ఓవర్‌లో మరో ఓపెనర్‌ జేమ్స్‌ విన్స్‌ 27 బంతుల్లో చకాచకా 27 పరుగులు చేశాడు. అయితే భారత్‌ ఫీల్డింగ్‌ అప్రమత్తంగా వ్యవహరించి..విన్స్‌ను రనౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపింది. దాంతో భారత్‌ సిరీస్‌ గెలుస్తుందని క్రీడాభిమానులు అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగానే భారత జట్టులోనూ ఆశలు చిగురించాయి. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌తో జత కలిసిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నిదానంగా ఆడటం మొదలుపెట్టాడు. మరోవైపు స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అవకాశం దొరికినప్పుడల్లా వీరిద్దరూ బౌండరీలు బాదటం షురూ చేశారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఆ జోడీని విడదీయలేక చేతులెత్తేశారు. ఇదే అదనుగా వారు దూకుడు పెంచి.. ఇరువురూ హార్దిక్‌ పాండ్య వేసిన 29ఓవర్‌లో శతక భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంగ్లాండ్‌ మరో 33బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 2-1తో కైవసం చేసుకున్నది.ఆ ముగ్గురు ఆడినా..: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిశిఖర్‌ ధావన్‌,ధోని త్రయం దీటుగా ఆడింది. ఈ ముగ్గురి స్కోరు పుణ్యమా అంటూ 256 పరుగులకు చేరింది.ఆతిథ్య ఇంగ్లాండ్‌కు 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్‌ ఇండియా బ్యాట్స్‌మెన్స్‌ ఇక రెచ్చిపోతారనుకుంటున్న ... కీలక సమయాల్లో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూకట్టారు.ఇదే దూకుడుతో ఇంగ్లాండ్‌ బౌలర్లు అటు స్పిన్‌ ఇటు పేస్‌తో ఉక్కిరి బిక్కిరి చేశారు. పరుగులు చేయకుండా ఒత్తిడి పెంచారు. అయినా సత్తా చాటి 256 స్కోరును నిలబెట్టారు. కెప్టెన్‌ ¸ విరాట్‌ కోహ్లీ 72 బంతుల్లో ఎనిమిది ఫోర్లు బాది 71 పరుగులు చేశారు. శిఖర్‌ ధావన్‌ 49 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు ఉన్నాయి.ధోనీ కూడా పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకుంటూ 66 బంతుల్లో 42 పరుగులు సాధించాడు.చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ 13 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు బాదాడు. ఇలా ఈ బ్యాట్స్‌మెన్లు రాణించడంతో భారత్‌ 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.బౌలింగ్‌ పరంగా డేవిడ్‌ విల్లే(3/40), రషీద్‌(3/49) బంతితో చెలరేగిపోయి నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ను 256పరుగులకే కట్టడి చేశారు. విరాట్‌కోహ్లి కెప్టెన్సీలో విదేశీ గడ్డపై తొలి వన్డే సిరీస్‌ ఓడింది. 2011 తరువాత ఇంగ్లాడ్‌ భారత్‌పై తొలి సిరీస్‌ను కైవసం చేసుకుంది. వరుసగా బారత్‌ 9 సిరీస్‌ లను గెలుస్తూ వస్తున్న విజయ పరంపరకు బ్రేకు పడినట్టయింది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.