ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు మార్పులు ..!

ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడ్డ వాషింగ్టన్ సుందర్, బుమ్రా బదులుగా స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, పేసర్ దీపక్ చాహర్‌ను జట్టులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈనెల 12న మొదలయ్యే వన్డే సిరీస్ కోసం సుందర్ స్థానంలో అక్షర్‌పటేల్‌ను సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరీ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా సుందర్, బుమ్రా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం భారత ఎ జట్టుకు యువవికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. 

©2019 APWebNews.com. All Rights Reserved.