చండీమల్‌పై ఐసీసీ అభియోగాలు...!

శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమల్ బాల్ టాంపరింగ్ ఉదంతం మరో మలుపు తిరిగింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో చండీమల్ బంతి ఆకారాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు టెలివిజన్ ఫుటేజీ ఆధారంగా మ్యాచ్ అధికారులు గుర్తించారు.

ఎడమవైపు ప్యాకెట్‌లోని స్వీట్స్‌ను నోట్లో వేసుకున్న చండీమల్..బంతిపై రుద్దేందుకు ప్రయత్నించినట్లు తేలింది. దీంతో ఐసీసీ క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత చండీమల్‌ను విచారించే అవకాశముందని ఐసీసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే బాల్ టాంపరింగ్ ఉదంతంలో తన తప్పుఏమీ లేదని చండీమల్ స్పష్టం చేశాడు. ఒక వేళ తప్పు ఉందని తేలితే చండీమల్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే చాన్స్ ఉంది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.