కోహ్లీ గడ్డానికి బీమా !

భారత క్రికెట్ విరాట్ కోహ్లీ..ఆటలోనే కాదు ఆహార్యంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఆటగాడు. నిత్యం గడ్డంతో కనిపించే కోహ్లీని చూసి ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతూనే ఉన్నారు.

అప్పట్లో ఓసారి టీమ్‌ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సహచర క్రికెటర్లందరికీ గడ్డం తీసేయమంటూ సవాలు విసిరితే..దాన్ని కోహ్లీ తిరస్కరించాడు. దీనికి అనుష్క కూడా నీవు తీయాలన్నా గడ్డం తీయలేవుగా అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ గడ్డం ఎందుకు తీయడో రాహూల్ చేసిన ట్వీట్‌తో తెలిసింది. గడ్డానికి బీమా చేసుకున్న కారణంగానే కోహ్లీ తీయలేక పోతున్నట్లు బీమాకు సంబంధించిన విషయంపై వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కోహ్లీ గడ్డాన్ని పరీక్షిస్తూ తమకు కావాల్సిన వివరాలను సేకరించినట్లు వినికిడి. ఇందులో ఒకరు ఫొటోలో తీయడంలో నిమగ్నం కాగా, మరొకరు కొలతలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ప్రతినిధులు సూచించిన పేపర్లపై కోహ్లీ సంతకం కూడా చేశాడు. హాహా గడ్డం నిన్ను బాగా విసిగిస్తుందన్న విషయం నాకు తెలుసు. నీ గడ్డానికి బీమా తీసుకున్నావన్న వార్త నేను బయటకు వెల్లడించాను. అని రాహుల్ ట్వీట్ చేశాడు. మరీ దీనిపై కోహ్లీ ప్రతిస్పందన ఎలా ఉంటుదనేది ఆసక్తికరంగా మారింది. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.