భారత్‌లో పర్యటించే జట్లన్నీ ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ నిర్ణయం ....!

భారత్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయి. ఇక నుంచి భారత్‌లో పర్యటించే జట్లన్నీ ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ నిర్ణయించింది.

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) చైర్మన్ అతీఫ్ మాషల్ ఆహ్వానం మేరకు కాబూల్‌లో పర్యటిస్తున్న బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరీ గురువారం ఈ ప్రకటన చేశారు. దీని ప్రకారం భారత పర్యటనకు వచ్చే విదేశీ జట్లు ప్రధాన సిరీస్‌కు ముందు ఆఫ్ఘన్‌తో ఒక వామప్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ఈనెల 14న బెంగళూరులో ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.