ఆఫ్గాన్ టెస్ట్, ఇంగ్లాండ్,ఐర్లాండ్ పర్యటనలకు భారత జట్టు....!

అఫ్ఘనిస్తాన్ తో టీమిండియా జూన్ 14 నుంచి 18 వరకు ఆడనున్న టెస్టు మ్యాచుకు ఇవాళ బిసిసిఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. దీంతో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జట్టును, ఐర్లాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ లలో కూడా పాలుపంచుకోనున్న జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల భారత బృందానికి అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ టెస్టు నుంచి రెస్టు కల్పించింది బిసిసిఐ. ఇక అదే సమయంలో రహానేకు పరిమిత ఓవర్ల మ్యాచులలో ఆడేందుకు మాత్రం ఎంపిక చేయలేదు.

ఒకే మ్యాచులో మూడు టన్నులను బారిన కరుణ్ నాయర్ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అఫ్ఘానిస్థాన్ తో జరిగే ఏకైక చారిత్రక టెస్టుకు విరాట్ కోహ్లి స్థానంలో నాయర్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ముంబయి ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. సర్రే తరఫున ఇంగ్లాండ్ల కౌంటీ క్రికెట్ ఆడనున్న విరాట్ ఐర్లాండ్తో టీ20 సిరీస్తు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు అంబటి రాయుడికి ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు అవకాశం ఇచ్చారు. ఐర్లాండ్ టీ20 సిరీస్లో సిద్ధార్థ్ కౌల్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.

అఫాన్ టెకు భారత జట్టు: అజింక్య రహానె (సారథి), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్.

ఐర్లాండ్తో 2 టీ20లకు భారత జట్టు: వీరాట్ కోహ్లి సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుదర్, కుల్దీప్ యాదవ్,భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్డ్ ఔల్, ఉమేశ్ యాదవ్

ఇంగ్లాండ్తో 3 టీ20లకు భారత జట్టు: విరాట్ కోహ్లి (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుదర్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్డ్ ఔల్, ఉమేశ్ యాదవ్

ఇంగ్లాండ్ 3 వన్డేలకు భారత జట్టు: విరాట్ కోహ్లి (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుదర్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జగ్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్దార్థ్ ఔల్, ఉమేశ్ యాదవ్.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.