ప్లేఆఫ్‌కు కోల్‌కతా...!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌కు చేరింది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది.

ఫలితంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తర్వాత ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది.సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్‌ విజయంలో క్రిస్‌ లిన్‌(55; 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్‌ ఉతప్ప(45; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించగా, సునీల్‌ నరైన్‌(29; 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌(25 నాటౌట్‌) తమవంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించారు.

 తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ జోరుని కొనసాగించారు. మ్యాచ్ ఆరంభంలోనే లయ తప్పిన కోల్‌కతా బౌలర్లని ఓపెనర్ శ్రీవాత్సవ గోస్వామితో కలిసి ఉతికారేసిన శిఖర్ ధావన్ తొలి వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమివ్వగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూకుడుతో జట్టు స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. దీంతో.. ఒకానొక దశలో హైదరాబాద్ 200+ స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. మిడిల్ ఓవర్లలో యూసఫ్ పఠాన్ (2), బ్రాత్‌వైట్ (3) తక్కువ స్కోరుకే పరిమితమవడం.. ఆఖర్లో మనీశ్ పాండే (25: 22 బంతుల్లో 2x4, 1x6) ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో హైదరాబాద్ 172 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.