రాజస్తాన్ పై కోలకత్తా విజయం ..

ఐపీఎల్ 2018 సీజన్‌‌లో ప్లేఆఫ్ ఆశల్ని అద్భుత విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో

ఓపెనర్ క్రిస్‌లిన్ (45: 42 బంతుల్లో 5x4, 1x6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (41 నాటౌట్: 31 బంతుల్లో 5x4, 1x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కి జోస్ బట్లర్ (39: 22 బంతుల్లో 5x4, 2x6), రాహుల్ త్రిపాఠి (27: 15 బంతుల్లో 4x4, 1x6) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిల్ ఓవర్లలో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 19 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులకే కుప్పకూలిపోయింది. ఛేదనలో ఓపెనర్ సునీల్ నరైన్ (21: 7 బంతుల్లో 2x4, 2x6) తొలి ఓవర్‌లోనే 21 పరుగులు బాది శుభారంభమివ్వగా.. మధ్య ఓవర్లలో నితీశ్ రాణా (21: 17 బంతుల్లో 2x4, 1x6) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో క్రిస్‌లిన్ ఔటైనా.. ఆండ్రీ రసెల్ (11 నాటౌట్: 5 బంతుల్లో 2x4)తో కలిసి మరో 12 బంతులు మిగిలి ఉండగానే దినేశ్ కార్తీక్ సిక్స్‌తో గెలుపు లాంఛనాన్ని 145/4గా పూర్తి చేశాడు. తాజా విజయంతో (14 పాయింట్లు) పట్టికలో కోల్‌కతా తన మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రాజస్థాన్ ప్లేఆఫ్‌ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. కోల్‌కతా బౌలర్‌ మావి ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో రాజస్తాన్‌ 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో తొలి బంతికే స్లిప్‌లో త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను రాణా వదిలేశాడు కూడా. రెండో ఓవర్‌ వేసిన ప్రసి«ద్‌ కూడా తొలి రెండు బంతుల్లో ఒకటే పరుగిచ్చాడు. అయితే ఆ తర్వాతి పది బంతులు రాయల్స్‌ పరుగుల తుఫాన్‌ను ప్రదర్శించింది. అనంతరం నరైన్‌ వేసిన ఓవర్లో కూడా రెండు బౌండరీలతో 10 పరుగులు వచ్చాయి. అయితే రసెల్‌ బౌలింగ్‌తో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ మలుపు తిరిగింది. పుల్‌ షాట్‌ ఆడబోయి త్రిపాఠి, కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో 63 పరుగుల (29 బంతుల్లో) తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం కుల్దీప్‌ అద్భుత స్పెల్‌ రాయల్స్‌ పతనాన్ని శాసించింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి రహానే (11) క్లీన్‌ బౌల్డ్‌ కాగా... అతని తర్వాతి ఓవర్లో మరో రివర్స్‌ స్వీప్‌కు బట్లర్‌ కూడా వెనుదిరిగాడు. జోరుగా ఆడే ప్రయత్నంలో థర్డ్‌మాన్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔటైన బట్లర్, టి20ల్లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో అర్ధసెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం చేజార్చుకున్నాడు. బట్లర్‌ ఆట ముగిశాక రాజస్తాన్‌ టపటపా వికెట్లు కోల్పోయింది.   

 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.