తెలుసుకోవాలన్న తపన మనిషి చేత ఎన్నో కొత్త.. కొత్త ఆవిష్కరణలకు కారణం అవుతుంది. తన తుపాకీ నుంచి తప్పించుకున్న ఒక పక్షి వేగాన్ని తెలుసుకోవాలన్న తపనతో ఒక వ్యక్తి చేసిన ప్రయత్నమే.. నేడు గిన్నిస్‌ రికార్డ్సుగా మన ముందుకు వచ్చింది. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అంటే తెలియని వారు ఉండరు. మరి ఈ బుక్‌ హిస్టిరీ ఏమిటో తెలుసుకుందామా!

స్కాండినేవియన్‌ దేశమైన నార్వేకు అర్ధరాత్రి సూర్యుడుండే దేశమని పేరు. ఈ దేశంలో మే నెల మధ్య నుండి జులై నెలాఖరు వరకు సూర్యుడు పూర్తిగా అస్తమించడు.

మొక్కలకు ప్రాణం ఉంటుందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మొక్కలు వెలుగునిస్తాయి. వేళ్లతో రుచి చూస్తాయి. గాలి స్పర్శని గుర్తిస్తాయి. మరి వింటాయా? మాట్లాడుతాయా? అంటే మాట్లాడతాయి కూడా.

ప్రాచీన కాలంలో నిప్పు, చక్రం ఆవిష్కరణలు మానవ మనుగడనే మార్చేశాయి. అలాగే వైద్య రంగంలో ఎక్స్‌్‌రేలు కూడా. ఈ ఎక్స్‌-రే కిరణం కంటికి కనిపించదు. కానీ, దీని ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఇది ప్రాథమికంగా విద్యుదయస్కాంత శక్తి కిరణం. అసలు, ఈ ఎక్స్‌రేలు ఎలా తయారు చేశారు? వాటి ఆవిర్బావం ఎలా జరిగింది. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి.

 ఉంగరం చూశారా? ఇది సాదా సీదా ఉంగరం కాదు.. వజ్రాల ఉంగరం. ఇందులో ఏకంగా 6690 వజ్రాలు ఉన్నాయి. అందుకే, ఈ ఉంగరం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కేసింది. ఇంతకీ ఈ ఉగరం తయారైంది ఎక్కడో కాదు. మన ఇండియాలోనే. వజ్రాల వ్యాపారానికి కేరాఫ్ అడ్రసైన గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. 

 కమలం ఆకారంలో ఉన్న ఈ ఉంగరం బరువు 58 గ్రాములు. దీని తయారీకి 18 క్యారెట్ల బంగారం వాడారు. విశాల్ అగర్వాల్, ఖుష్బు అగర్వాల్ అనే ఇద్దరు వ్యాపారాలు ఈ ఉంగరాన్ని తయారు చేశారు. దీని తయారీకి ఆరు నెలలు పట్టిందని విశాల్ తెలిపారు. నీటిని పరిరక్షించాలనే సందేశం ఇవ్వడానికే తాము ఈ రికార్డు కోసం ప్రయత్నించామని తెలిపారు. 

నీటిలో పెరిగే ‘కమలం’.. మన జాతీయ పుష్పం కావడంతో అదే ఆకారంలో ఈ ఉంగరాన్ని రూపొందించామని తెలిపారు. ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ నిర్వాహకులు సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ వజ్రాల ఉంగరం ధర ఎంత చెప్పనేలేదు కదూ. దీని ధర అక్షరాలా రూ.28 కోట్లు! 

ఈ ఉంగరాన్ని ఎలా తయారు చేశారో ఈ వీడియోలో చూడండి

 

అలాగే ఎందుకుండాలి? ఇలా ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న మరో కొత్త ఆవిష్కరణకు ఊపిరి పోస్తుంది. ఇప్పటి వరకూ ఆవిర్భవించినవన్నీ దాదాపు అలాంటి ప్రశ్నల నుంచి ఉద్భవించినవే. అలాంటిదే ఇప్పుడు మరొకటి ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిచిన్నది.. అంటే.. అరచేతిలో ఇమిడిపోయే సైజులో, ఎంచక్కా జేబులో పెట్టుకొని దాచుకునేంత సైజులో కృత్రిమ ఉపగ్రహాన్ని(శాటిలైట్) తయారుచేశారు మనోళ్లు. ఆ కథా కమామీషు ఈ రోజు సంకేత ప్రత్యేక కథనం.

ఆ రెస్టారెంట్‌కు దేశదేశాల నుంచి అతిథులు వస్తుంటారు... అందులో ప్రత్యేకమైన వంటకాలేమీ చేయరు.. కానీ గిన్నీస్‌ రికార్డు కొట్టింది..ఇంతకీ ఆ రెస్టారెంట్‌ ఎక్కడుంది. దాని విశేషాలెంటో తెలుసుకుందామా!

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్‌ను అమెరికా ఆవిష్క రించింది. దీనికి 'సమిట్‌'గా నామకరణం చేసింది. చైనాకు చెందిన 'సన్‌వే తైహులైట్‌' రికార్డులను దీని సాయంతో బద్దలుకొట్టింది.

©2018 APWebNews.com. All Rights Reserved.