భారతదేశానికి ప్రధానులుగా పనిచేసిన వారిలో ఉత్తమ ప్రధానిగా అందరి మన్ననలు పొందిన అటల్ బిహారీ వాజపేయి(వాజ్‌పాయి) మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో 1924, డిసెంబర్ 25న జన్మించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తొలి నాయకుడు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి.

72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది.

మనం మన శరీరాన్ని కొద్దిగా అటు ఇటుగా వంచాలన్నా భయపడిపోతాం.. ఎముకలు ఎక్కడ విరిగిపోతాయో.. ఎక్కడ పట్టుకుంటుందో అని వణికిపోతాం.. కానీ పాలస్తీనాకు చెందిన ఓ బుడుగు మాత్రం తన శరీరాన్ని అష్ట వంకర్లు తిప్పేస్తున్నాడు. ఆకారం లేని ఆక్టోపస్‌లా చుట్టేస్తున్నాడు. అందుకే ఆ బాలున్ని గిన్నిస్‌ వరించింది.

వందేళ్ల క్రితం హైదరాబాద్‌లో మూసీ వరదల సమయంలో ఎంతో మంది ప్రాణాలు నిలిపిన చెట్టు ఇంకా ఉందని తెలిసి ఆశ్చర్యపోయాం. కానీ మెక్సికోలో ఒక చెట్టు 2 వేల ఏళ్ల నుంచి ఉంది. ప్రపంచంలో అతి పురాతనమైన చెట్టుగా దానికి గుర్తింపు ఉంది. ఆ చెట్టు విశేషాలు చదవండి...

ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు సామాన్యులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తారు. పోలీసుల విషయం అయితే చెప్పనక్కర్లేదు. వారు ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగి కాపాడే ప్రయత్నం చేస్తారు. దేశంలోనే తొలిసారిగా 36 మంది అమ్మాయిలతో స్వాట్ టీమ్ ఏర్పాటైంది. వాళ్లేం చేస్తారంటే..

నాసా పార్కర్ సోలార్ ప్రోబ్‌ను శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రయోగించారు. సూర్యుడ్ని తాకి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి 1.5 బిలియన్ డాలర్లతో ఈ ప్రాజెక్టును నాసా్ రూపొందించింది.

మనకి సమాంతరమైన విశ్వం ఇంకొకటి వుందా? ఈ ఆలోచన మనకి గుగుర్పాటు కలిగిస్తుంది కానీ, ఇది నిజం కావచ్చంటున్నారు డాక్టర్ బ్రైన్ గ్రీన్. ’ది హిడెన్ రియాలటి: పారలేల్ యూనివర్స్, డీప్ లాస్ ఆఫ్ కాస్మోస్”  అనే పుస్తకం రాసిన ఆయన ఇచ్చిన  ఒక టివి ఇంటర్వూలో  నిరంతరం  చలనం  లక్షణంగా వున్న  ఈ ఖగోళ విశ్వంలో,  మన  ప్రపంచం  పక్కనే ఇంకొక ప్రపంచం  వుండవచ్చని చెప్పారు.

ఫ్రాంక్‌ హాషెమ్‌ ఎత్తు కేవలం నాలుగున్నర అడుగులు. ప్రపంచంలోనే అతిపొట్టి బస్సుడ్రైవర్‌గా గిన్నిస్‌ రికార్డులకెక్కాడు. ‘పొట్టిగా ఉన్నాం.. జీవితంలో ఏం సాధించలేం’ అని కుంగిపోతున్న యువతలో ఏదైనా సాధించాలనే స్ఫూర్తి నింపుతున్నాడు.

 

దేశరాజకీయాలని ప్రబావితమ చేయగల సమర్థులు డీఎంకే చీఫ్ తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి(94).  తమిళనాడు రాజకీయాలకు సరికొత్త అర్ధాన్ని చెప్పిన వారిలో ఒకరు. దేశ రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేయగల సమర్థులు. దేశవ్యాప్తంగా చూసుకుంటే అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయనే మొదటి వారు. తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నఆయన ఆగష్టు 7, 2018న తుది శ్వాస విడిచారు.ఇకపోతే కరుణానిధి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

©2019 APWebNews.com. All Rights Reserved.