మనదేశంలో జాతీయ పార్కులు బోలెడు ఉన్నాయి. వాటిల్లో సరస్సులు కూడా ఉన్నాయి. కానీ సరస్సుల్లోనే తేలియాడే జాతీయపార్కు కిబుల్‌ లామ్జావో జాతీయ పార్కు.

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 1956 సెప్టెంబర్ 2 న కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు.

గిడుగు రామమూర్తి బహు భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, మానవ శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, సంఘ సంస్కర్త, మానవతావాది, బహుముఖ ప్రజ్ఞాశాలి. గిడుగు శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేట గ్రామంలో 1863 ఆగస్టు 29న జన్మిం చాడు.

 

-పట్టుదలతో పర్వతాలెక్కుతున్న ఓ సామాన్యుని కథ ఇది.
-ఆరు పర్వాతాలెక్కిన అసాధ్యుడి కథ ఇది. 
-దేశం నలుమూలలా కీర్తిపతాకను ఎగురవేస్తున్న తెలంగాణ బిడ్డ కథ ఇది.
-విధి వంచించినా విజయాన్ని తల వంచుకునేలా చేసిన మరిపెల్లి ప్రవీణ్‌పై ప్రత్యేక కథనమిది.

చేతిలో ఫోన్‌ ఇప్పుడు సాధారణం. కానీ ఆ ఊళ్లో వాళ్ల చేతుల్లో ఒక్క సెల్‌ఫోన్‌ కనిపించదు. వై ఫై ఊసే ఉండదు. ఇంకా చెప్పాలంటే టీవీ, రేడియో కూడా లేవు. అలా అని ఈ ఊరు ఎక్కడో అడవిలో ఉందనుకుంటే పొరపాటే! ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటే...

'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

వరలక్ష్మీ వ్రతం గురించిన శాస్ర్తోక్త సమాచారం వ్రతకల్పంలో ఉంది. ప్రతీ సంవత్సరం శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు దీనిని ఆచరించాలి. భవిష్యోత్తర పురాణంలోని పార్వతీ పరమేశ్వర సంవాదమే ఈ వ్రతకల్పాదులకు మూలం.

వేళా విశేషం

మనకు ఐశ్యర్యం, బంగారం, సంపద, సంతానం, వాహనాలు వంటి భాగ్యాలన్నింటినీ ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. స్థితికారుడైన మహావిష్ణువుకు ఆమె సతీమణి. మానవులకు ఆమె అనుగ్రహం అత్యంత అవసరం. ఆమె దయ వుంటేనే అన్ని రకాల సంపదలూ కలుగుతాయి. కాబట్టే, ఆమెకు ఇంతటి అ(వి)శేష ప్రజాదరణ.

లక్ష్మీదేవి గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే శ్రీసూక్తం చదవాలి. అందులో ఆమె సమగ్ర స్వరూపం సాక్షాత్కారిస్తుంది. జాత వేదసుడైన ఓ అగ్నిదేవుడా! హిరణ్మయి అయిన లక్ష్మీదేవిని నా కోసం ఆహ్వానించు. ఓ శ్రీదేవీ! దేవసఖుడైన కుబేరుడు, చింతామణితోపాటు కీర్తి కూడా నన్ను వరించేలా చేయుము అన్నది శ్రీసూక్తంలోని వేడుకోలు. ఇందులో ఫలశ్రుతిలోని ఈ సుప్రసిద్ధ శ్లోకం ప్రతి ఒక్కరికీ పఠనీయం.

శుద్ధలక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ
శ్రీలక్ష్మీ ర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా॥

శ్రీమహాలక్ష్మియే శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. ఆమెనే సరస్వతి కూడా. అంతేకాదు, వరలక్ష్మి కూడా ఆమెనే! అటువంటి వరలక్ష్మియే నాకు ఎల్లవేళలా ప్రసన్నురాలై వుండు గాక అన్నది ఇందులోని తాత్పర్యం.

స్థూలదృష్టితో చూసినప్పుడు ఇహలోకంలో విష్ణువు భార్యగా, సంపదలకు అధిదేవతగా లక్ష్మి ఆరాధనలు అందుకుంటున్నది. అలాగే, బ్రహ్మదేవుని భార్యగా, విద్యాధిదేవతగా, వాగ్దేవతగా సరస్వతి పూజలందుకుంటుంటే, పార్వతి శక్తిస్వరూపిణి. స్థూలంగా ఈ మూడు శక్తుల ముగ్గురమ్మలూ వేర్వేరు అయినప్పటికినీ.. సూక్ష్మదృష్టికి మూడు తత్వాలూ ఒక్కటే.

భాద్రపద శుద్ధ చవితినాడు వరసిద్ధి వినాయక వ్రతం ఆచరిస్తాం. దానికి సుమారుగా 25 రోజుల ముందు సువాసినులు (ముత్తయిదువులు) తమ వైభవం కొద్దీ శ్రీ వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈ రెండు వ్రతాలలోనూ వరశబ్దం శ్రేష్ఠతా వాచకంగా ఉంది. ఈ రెండింటిలోనూ వర అభయంతో కోర్కెలను సిద్ధించుకోవడమే అసలు లక్ష్యం. ఏ వ్రతాన్నయినా కల్పోక్త ప్రకారం చెయ్యాలి. అమ్మవారికి ప్రతీకగా ఆమె విగ్రహాన్ని కానీ లేదా ఫొటోను కానీ పూజా మండపంలో ప్రతిష్టించుకోవాలి. పూజకు చెందిన ఉపచారాలన్నీ అత్యంత భక్తిశ్రద్ధలతో, సావధానంగా, నిష్ఠగా, విశ్వాస భరితంగా చెయ్యాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. ఈ వ్రతాచరణలో భర్త సాన్నిధ్యం ఎంతో అవసరం.

వరలక్ష్మీ వ్రతంలో మొట్టమొదటిది సంకల్పం. తర్వాత వరుసగా కలశపూజ, గణపతి పూజ, గౌరీపూజల తర్వాత వరలక్ష్మీ పూజను ప్రారంభించాలి. ధ్యానంతో మొదలుపెట్టి, అమ్మవారికి ఆవాహనం, రత్న సింహాసనం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రయుగ్మం, ఆభరణాలు, ఉపవీతం, గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు సమర్పిస్తూ అంగపూజ చేయాలి. పిమ్మట అష్టోత్తర శతనామాలతో పూజించి, ధూపం, దీపం, నైవేద్యం, పానీయం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణం వంటివన్నీ క్రమం తప్పకుండా ఆచరించాలి.

నమస్తే త్రైలోక్య జననీ
నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే
వరలక్ష్మై నమోనమ:
అంటూ భక్తి పూర్వకంగా నమస్కరించాలి. 
తర్వాత తోరగ్రంథి (తొమ్మిది ముళ్లతో కూడిన తోరం) 
పూజ ఈ వ్రతంలో ప్రధానం.

బధ్నామి దక్షిణే హస్తే
నవసూత్రం శుభప్రదమ్
పుత్ర పౌత్రాభి వృద్ధించ
సౌభాగ్యం దేహిమేరమే

సువాసినులు ఈ తోర బంధన మంత్రం చదువుతూ కుడిచేతికి రక్షాబంధనం వలె తోరాన్ని కట్టుకోవాలి. వాయనదానం ఇచ్చిన తర్వాత గౌరీ-ఈశ్వర సంవాదరూపంలోని వ్రతకథను అత్యంత భక్తి శ్రద్ధలతో వినాలి. మర్నాటి (శనివారం) శుభవేళ వ్రతోద్యాపనం, విసర్జనం చేయాలి.

ఈ వ్రతం వల్ల స్త్రీలకు సకల సౌభాగ్యాలూ సమకూరుతాయనడానికి గుర్తుగా చారుమతి అనే పరమ భక్తురాలి కథను చెప్తారు. స్వయంగా అమ్మవారే ఆమెకు కలలో కనిపించి, శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించవలసిందిగా ఉపదేశిస్తుంది.

కలియుగంలో స్వప్న దర్శనమే ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి, చారుమతీదేవితోపాటు మరికొంతమంది సువాసినులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అద్భుత ప్రయోజనాలు పొందారన్నది ఈ వ్రతకథ వృత్తాంతం. దీనిని ఫలానా వారే చెయ్యాలన్న నియమమేమీ లేదు. ఎవరైనా ముత్తయిదువులు తమ భర్తలతో కూడి చక్కగా ఆచరించుకోవచ్చు.

సౌభాగ్యం, సకల సంపదలూ కలగాలన్నా లేక అదృష్టంలో మార్పు రావాలన్నా అది కేవలం సాధనతోనే సాధ్యం. అప్పటికీ సంపదలు అందక దారిద్య్రమే కొనసాగుతుంటే, దానిని కనీసం అనుకూలంగా మార్చుకొనే అవకాశమైనా పొందగలం. కాబట్టి, సువాసినుల వరలక్ష్మీ పూజలకు వారి భర్తలందరూ తమ వంతు సహకారాన్ని అందించడం మంచిది.

అష్టలక్ష్మీ కటాక్షం కోసం..

ప్రధానంగా లక్ష్మీదేవి విషయంలో అష్టలక్ష్మీ సమాశ్రయ పూజా విధానం ఒకటున్నది. దానిలో శ్రీలక్ష్మీ షట్కం ప్రధానమైంది. అంటే, శుద్ధలక్ష్మియే గజలక్ష్మి. విజయ వీరలక్ష్మిలే జయలక్ష్మి. ధనధాన్య సంతాన లక్షులే శ్రీలక్ష్మి. విద్యాలక్ష్మియే సరస్వతి. శ్రీ మహాలక్ష్మినే వరలక్ష్మిగానూ పరిగణిస్తున్నాం. కాబట్టి, అష్టలక్ష్మీ కటాక్షం కోసం ఏడాదిలో అరుదుగా, ప్రత్యేకించి ఈ శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీదేవిని ఆరాధించడం పూజ అత్యంత శ్రేయస్కరం.

త్యాగం మినిషిని ఉన్నతుడిని చేస్తుంది. దైవ పరీక్షలో కట్టుకున్న భార్యను వదిలి, కన్నకొడుకు ప్రాణాలను బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుడి త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసిన అనంతరం ఖుర్బానీ ఇచ్చి దైవప్రీతి కోసం తమ ధనాన్ని, ప్రాణాన్ని, సంతానాన్ని, సమస్తమూ త్యాగం చేయడానికి సిద్ధమని నిరుపించుకుంటారు. నేడు బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం.

©2019 APWebNews.com. All Rights Reserved.