గ్రహాంతర జీవులు ఉన్నారా.. ఉంటే నాగరికతపరంగా వారు మనకన్నా చాలా ముందున్నారా..? అంతరిక్ష పరిశోధకులను చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్నలివి. తాజా పరిశోధన ఈ సందేహాలను తీర్చింది.

ప్రస్తుతం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయినా ఎయిరిండియాకు చెందిన ఎన్నో విమానాలు చక్కర్లు కొట్టడం చూస్తున్నాం..కానీ మొదటి ఎయిరిండియా విమానం వచ్చి ఎన్ని ఏళ్లు గడించింది..

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్. ఇతను యూత్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతిష్ఠాత్మక 2014 టోర్నీలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.

బిల్ గేట్స్‌గా అందరికీ తెలిసిన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత మరియు గొప్ప దాత. వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులోతెచ్చినవ్యక్తిగాబిల్గేట్స్ఎంతోపేరుపొందాడు. ప్రస్తుతం బిల్ గేట్స్ ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు.
ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తికాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌లో తన కార్యకలాపాలకు శుక్రవారం (2008 జూన్ 28) బిల్ గేట్స్ వీడ్కోలు పలికారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ దానాలు, సహాయాలు చేసాడు. చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ రూపకల్పన, అభివృద్ధికి జీవితాన్ని ధారపోసిన గేట్స్ కొత్త వాక్సిన్‌లను కనుగొనే సంష్టలకు నిధులు సమకూర్చటం తన వంతు సహాయం చేసే కార్యకలాపాల మీద దృష్టి పెట్టబోవుచున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మిగిలిన జీవితాన్ని, శక్తిని వినియోగించనున్నారు.

బిల్ గేట్స్ అక్టోబర్ 28 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో ఒక ధనవంతులు కుటుంబంలో జన్మించాడు. ఎలెమెంటరీ స్కూల్లో ఉన్నపుడు గణితం మరియు సైన్స్‌లలో చాలా ప్రతిభ చూపించేవాడు. తన మిత్రుడు పాల్ అల్లెన్‌తో కలసి కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్ (BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో పాల్ అల్లెన్‌తో కలసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలు పెట్టాడు. మొదటి ఏడాది 20,000 డాలర్లు సంపాదించినా, బిల్ గేట్స్ వయసు 14 అన్న విషయం తెలిసి వ్యాపారం తగ్గుముఖం పట్టింది.

1975లో MITS అనే మైక్రోకంప్యూటర్ సంస్థకి అవసరమయిన సాఫ్ట్‌వేర్ తాము అందించగలమని బిల్ గేట్స్ తెలిపి, తర్వాత ఆ సంస్థ కార్యాలయములో తమకు తెలిసినవి చూపించడంతో ఇద్దరితో ఆ సంస్థ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది . మొదట మైక్రో-సాఫ్ట్ అని పేరు పెట్టినా, ఏడాది తర్వాత మైక్రోసాఫ్ట్ అన్న పేరు నమోదు (రిజిస్టర్) చేయించారు.

MITS సంస్థవారు బిల్ గేట్స్ అందిస్తున్న బేసిక్ కోడ్‌ను ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆ కోడ్‌ను కాపీ కొట్టి వాడుతుండడం తెలిసిన బిల్ గేట్స్ ఆ సంస్థతో భాగస్వామ్యం రద్దు చేసుకొని స్వతంత్రుడయ్యాడు. బిల్ గేట్స్ 1980 వరకు సంస్థ వ్యాపార వ్యవహారలన్నీ చూసుకోంటూనే ప్రోగ్రాములు రాసేవాడు. ఐదేళ్ళపాటు కంపెనీలో ప్రతివ్యక్తి రాసిన ప్రతి లైను పరిశీలించి అవసరమయినచోట మార్పులు చేసేవాడు.

1980లో ఐ.బి.ఎం (IBM) సంస్థవారు తాము తయారు చేయబోయే పర్సనల్ కంప్యూటర్‌లకు అవసరమయిన BASIC interpreter కోసం బిల్ గేట్స్‌తో చర్చిస్తూ, ఒక మంచి ఆపరేటింగ్ సిస్టం కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.అపుడు బిల్ గేట్స్ తనకు తెలిన SCP అనే సంస్థ తయారు చేసే 86-DOS ఆపరేటింగ్ సిస్టం లైసెన్సు తీసుకొని IBMకు అమ్మడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు SCPని కొని ఎం.ఎస్.డాస్ (MS-DOS) ఆపరేటింగ్ సిస్టంగా ఐ.బి.ఎం సంస్థకు అందించేలా ఒప్పందం చేసుకున్నాడు. అప్పటినుండి మైక్రోసాఫ్ట్ వెనుతిరిగి చూడలేదు.
బిల్‌గేట్స్ దార్శనికత మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థగా మార్చింది. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్‌వేర్ ప్రపంచాన్ని బిల్‌గేట్స్ తన హస్తగతం చేసుకున్నారు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కరణలకూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్‌గేట్స్ తనకు ఈ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నారు.అనతి కాలంలో బిల్ గేట్స్ మిలియనీర్ అయ్యాడు.

2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడవ ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య మొదలయిన సేవలకు ధన సహాయం చేస్తున్నాడు. బిల్ గేట్స్ ఇచ్చిన కొన్ని విరాళాలు: ($1 మిలియన్ = $1,000,000)

ప్రపంచ ఆరోగ్య సంస్థకు - $800 మిలియన్లు (ప్రతి ఏడాది)
పసిపిల్లల వ్యాక్సిన్లకు - $750 మిలియన్లు
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్ - $210 మిలియన్లు
వాషింగ్టన్ డీసీలో పేదవిద్యార్థులకు - $122 మిలియన్లు 2004 ఫోర్బ్స్ పత్రిక లెక్కల ప్రకారం బిల్ గేట్స్ దాదాపు $29 బిలియన్లు విరాళాలు ఇచ్చాడు.

 

ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు.

కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం.

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో  గొప్ప స్థానానికి  వచ్చిన వల్లే, కానీ దాని వెనక ఎన్నో అవమానాలు, చిదరింపులు, శ్రమ , ఎంతో కష్టం దాగి ఉంది. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది, కానీ ఆ ప్రతిభని గుర్తించి  ఆచరణలో పెట్టగలగాలి.అలా ఆచరణలో పెట్టిన వ్యక్తే “ కోలనెల్ సాండర్స్”(Colonel Sanders,) ,KFC అదినేత. “ కోలనెల్ సాండర్స్” గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం…

ఒకప్పుడు చూపులేదని ఈసడించిన సమాజం..28 ఏళ్ల తర్వాత అదే సమాజం చూపుని తనవైపు తిప్పుకున్న శ్రీకాంత్ !

పుట్టగానే గొంతు నులిమి చంపేయండని కొందరన్నారు. ఇంకొందరైతే- జీవితాంతం ఎందుకు భారం.. వదిలించుకోండి అని సలహా యిచ్చారు. పొయిన జన్మలో ఏ పాపం చేసుకున్నాడో కళ్లు లేకుండా పుట్టాడని కూడా మరికొందరు ఈసడించుకున్నారు.

ప్రపంచానికి ఆపిల్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌గా పిలువ బడే స్టీవెన్ పాల్ జాబ్స్ గురించి తెలుసుకుందాం.

1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన స్టీవ్ జాబ్స్‌ని పాల్ మరియు క్లారా జాబ్స్ అనే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత  కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరాడు. ఆయన లారెన్ పాల్‌ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు.

1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.

ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు.

తాను ప్రారంభిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని జాబ్స్ దానిని అలాగే పెట్టుకొన్నాడు అని ఒక కథనం.

తన దగ్గర ఉన్న డబ్బుతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించినందుకు గాను 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు.

కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది. ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEO గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది. జాబ్స్‌కు ప్రస్తుతం ఆపిల్ కంపెనీలో 7,500,000 షేర్లు ఉన్నాయి. 2007 ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్థి విలువ 5.7 బిలియన్ డాలర్లు.

56 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భాదతో ఆయన బుధవారం రాత్రి(అక్టోబర్ 5, 2011) కన్నుమూసారు. 

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం : నో టొబాకో డే -- 31st of May.

పొగాకుతో నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి.

సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి.

Page 5 of 6

©2018 APWebNews.com. All Rights Reserved.