జననం అనేది జీవించటానికి. ప్రాణం ఉండేది శ్వాసించటానికి. ప్రయాణం మొదలెట్టేది గమ్యం చేరుకోవటానికి. ఆరంభం అయ్యేది ఆఖరిదాకా సాగటానికి. వీటికి మధ్యలో ఆటంకం కలిగించటం, ఆపేయటం నైతికంగా తప్పు. చట్టపరంగా నేరం. దేవుడు పిలుస్తున్నాడనో, మోక్షం లభిస్తుందనో అర్ధాంతరంగా ప్రాణాలు తీయటం, తీసుకోవటం మూర్ఖత్వం.. మౌఢ్యం. మనిషికి బతకటానికి మించిన భాగ్యం లేదు. భూమికి మించిన స్వర్గం లేదు.

సూర్యుడి కాంతి భూమ్మీద పడుతున్న సందర్భంలో ఆ కాంతిని (విద్యుదయస్కాంత తరంగాల్ని లేదా జుశ్రీవష్‌తీశీ వీaస్త్రఅవ్‌ఱష ఔaఙవర) శబ్ద తరంగాలు (ూఱఅవ ఔaఙవర)గా నాసా వాళ్లు మార్చగా, ఆ శబ్దాలు అన్నీ 'ఓం' అంటున్నట్లు ఓంకార నాదంగా వచ్చాయని కొందరు కాషాయీకరణ కపటులు ప్రచారం చేశారు.

మీరిప్పటి వరకూ రకరకాల మ్యూజియాల గురించి వినే ఉంటారు. మరి మీరెప్పుడైనా గణితానికి సంబంధించిన మ్యూజియం గురించి విన్నారా? ఈ మ్యూజియం ఉంది మరెక్కడో కాదు చెన్నైలోనే. ఇంతకీ ఈ మ్యూజియం పేరేంటో తెలుసా రామానుజన్‌ మ్యూజియం. భారతీయ గణిత దిగ్గజం రామానుజం పేరున ఈ ఏడాది అక్కడి శాస్త్రా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఆ మ్యూజియం గురించి మీరూ తెలుసుకోండి.

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- జెట్టి పరమేశ్వరరావు

వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి.రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం.

ఇది రాయల్‌ ప్యాలస్‌ కాదు. విలాసవంతమైన భవనం అంతకన్నా కాదు. వందల గదుల్లేవు. కనీసం రెండు, మూడు ఎకరాల భూమి కూడా లేదు. కేవలం ఎకరంలో మూడో వంతు ఉన్న స్థలంలో నిర్మించిన నాలుగు బెడ్‌రూంల ఇల్లు.

సమాజంపై సోషల్‌ మీడియా విపరీత ప్రభావం చూపుతున్న కాలం. ఈ కాలంలో కళలతో కుర్రకారు పెంచుకుంటున్న సంబంధం మరింత బలపడుతోంది. వారిలోని సృజనాత్మకత, నైపుణ్యాలనే కాకుండా కళలపై వారికున్న ఇష్టానికి ప్రచారం కల్పించుకోవడానికి సోషల్‌ మీడియా మంచి వేదికగా నిలుస్తోంది.

కరెంటు లేని ఊళ్ల గురించి మీరు వినే ఉంటారు. అయితే ఈ భూమి నుంచి వేల అడుగుల ఎత్తున ఉన్న కొన్ని గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నాయి. కనీసం గూగుల్‌ మ్యాప్‌కు కూడా అంతుచిక్కని ఈ గ్రామాల్లో సౌరశక్తి ఫలకాల ద్వారా వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది గ్లోబల్‌ హిమాలయన్‌ ఎక్స్పెడిషన్‌ (జిహెచ్‌ఈ)కు చెందిన బృందం. అదెలానో మీరూ తెలుసుకోండి. 

దసరా అంటేనే సరదాలకు లేపిన పరదా. ఆటపాటల వరద. ఊరూరా పందిళ్లూ సందళ్లూ .. అనేకనేక సాంస్కృతిక సంరంభాలూ సంబరాలూ. ఈ పండగ వెనక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.