ప్రణాళిక.. విజయానికి పాచిక 
సమయాన్ని సద్వినియోగం చేసుకోండి... 
విద్యార్థి.. యువతకు నిపుణుల సూచనలివి... 

కడప విద్య, న్యూస్‌టుడే : ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్‌.. మార్చి 15వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. ప్రస్తుత ప్రభుత్వ నోటిఫికేషన్‌తో టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత.. డిగ్రీ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు.. మొత్తంగా ఏ కార్యాచరణతో ఎంత మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారన్న క్షేత్రస్థాయి సమయపాలన అమలు సద్వినియోగంతోనే ఫలితాలు అందుకోనున్నారు. ఒక్కసారి సమయం మించిపోతే ఒత్తిడికి లోనుకావడం, ఆపై ఎంతోమంది యువత ప్రాణాలు విడవడం చూస్తూనే ఉన్నాం. కాలాన్ని ఎలా విభజన చేయాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో ముందుగానే ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారికే జీవితం పూలబాటగా మారుతుంది. ఏ మనిషికైనా రోజుకు 24 గంటలే. అయితే ఆ సమయాన్ని ఉపయోగించుకునే విధానం, ఆలోచన, ప్రణాళికతో వేసే అడుగులే ఒకరిని మొదటి స్థానంలో, మరొకరిని చివరి స్థానంలో, ఎంతో మందిని వారి మధ్యలో నిలిచేలా చేస్తుంది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దాన్ని సాధించుకునే క్రమంలో ఎవరి పట్టుదల, కృషి మేరకు వారు ఫలితాలు అందుకుని ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు. నిద్రలేకుండా చదవడం, చరవాణి, టీవీ, సినిమాలకు సమయం వృథా చేసుకోకుండా, ఒత్తిడిలోనై ఆరోగ్య, ఇతరత్రా సమస్యలు తెచ్చుకోకుండా ముందడుగులు వేయాలని చెబుతున్నారు. అటు విద్యాలయాలలోనూ ఇటు కోచింగ్‌ సెంటర్లలోనూ పరీక్షల వాతావరణం నెలకొన్న దృష్ట్యా సమయపాలన, ప్రణాళిక ప్రాముఖ్యతను విద్యార్థులు, అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

సరైన నిద్ర అవసరం : పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్న సమయంలో మనసు నిద్ర కోరితే కాస్త విశ్రమించడం మంచిదేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిద్ర వచ్చే సమయంలో బలవంతంగా ఆపుకుని చదవడం వల్ల ఏ విషయమూ మెదడుకు చేరకపోగా అనారోగ్యానికి దారితీస్తుంది. రాత్రి 11 గంటల తరువాత చదవడం మంచిది కాదన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. పరీక్షల కాలంలో సరైన నిద్ర లేకుంటే మెదడుకు అలసట పెరిగిపోయి చదువుతున్న అంశాలను గుర్తించుకునే వీలులేకపోవచ్చు. అందుకే రాత్రి 11 గంటల వరకూ చదివి తిరిగి వేకువజామున మూడు గంటల నుంచి చదివేలా ప్రణాళిక చేసుకోవాలి. ఈ సమయంలో మన మెదడులో ఎలాంటి ఆలోచనలు ఉండవు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చదివిన కొద్దిసేపైనా మననం చేసిన ప్రతి అంశం మెదడులో నిక్షిప్తమవుతుంది.

సఖి..న్యాప్‌క్వీన్‌ 
సఖి పేరుతో న్యాప్‌కిన్స్‌ తయారీలో రాణిస్తున్న షంషాద్‌బేగం 

మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆమె. తాను ఎంచుకున్న రంగంలో ఒక పరిశ్రమను స్థాపించి.. తాను బతుకుతూ పది మందికి ఉపాధి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక మహిళ ఒంటరిగా చేతిలో చిల్లిగవ్వ లేకుండానే ఆత్మసైర్థ్యమే ఆలంభనగా ముందుకు సాగారు. క్షేత్రస్థాయి ఎవరి సహకారం లభించలేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు.. చివరికి అనుకున్నది సాధించారు. పరిశ్రమ స్థాపించి ఐదుగురికి ఉపాధి చూపుతూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఆ మహిళ సాధించిన విజయం. 
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం 
కర్నూలు నగరంలోని ధర్మపేటకు చెందిన పొదుపు మహిళ ఎస్‌.షంషాద్‌బేగం. పదో తరగతి వరకు చదివారు. ఆమె భర్త కారు డ్రైవర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మంచానపడ్డారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ధర్మపేటలోని బిస్మిల్లా పొదుపు గ్రూపు లీడర్‌. ఏఎల్‌ఎఫ్‌ రిసోర్స్‌ పర్సన్‌.. స్వరాజ్యం సీఎల్‌ఎఫ్‌ సభ్యురాలిగా సిండికేట్‌ గ్రామీణ ఉపాధి ఉద్యమాభివృద్ధి సంస్థలో శిక్షణకు వెళ్లారు. అక్కడ శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఒక అధికారిణి శానిటరీ న్యాప్‌కిన్‌ పరిశ్రమ గురించి వివరించారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుందని  సలహా ఇచ్చారు.  ఆ అధికారిణి మాటలు షంషాద్‌బేగం మనసులో బలంగా నాటుకుపోయాయి. ఎలాగైనా న్యాప్‌కిన్స్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటే సరిపోదు. ఏదైనా పరిశ్రమ స్థాపనకు పెట్టుబడి కావాలి. తన దగ్గర దానికి సరిపడే డబ్బు లేదు. కుటుంబ పోషణే భారంగా ఉన్న పరిస్థితుల్లోనూ ధైర్యంతో ముందుకు సాగారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్ద్థ (మెప్మా)ను ఆశ్రయించారు. వారు పట్టించుకోలేదు.. సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేదు. అయినా సరే వెనుకడుగు వేయలేదు. 

©2019 APWebNews.com. All Rights Reserved.