ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు.

కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం.

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో  గొప్ప స్థానానికి  వచ్చిన వల్లే, కానీ దాని వెనక ఎన్నో అవమానాలు, చిదరింపులు, శ్రమ , ఎంతో కష్టం దాగి ఉంది. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది, కానీ ఆ ప్రతిభని గుర్తించి  ఆచరణలో పెట్టగలగాలి.అలా ఆచరణలో పెట్టిన వ్యక్తే “ కోలనెల్ సాండర్స్”(Colonel Sanders,) ,KFC అదినేత. “ కోలనెల్ సాండర్స్” గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం…

ఒకప్పుడు చూపులేదని ఈసడించిన సమాజం..28 ఏళ్ల తర్వాత అదే సమాజం చూపుని తనవైపు తిప్పుకున్న శ్రీకాంత్ !

పుట్టగానే గొంతు నులిమి చంపేయండని కొందరన్నారు. ఇంకొందరైతే- జీవితాంతం ఎందుకు భారం.. వదిలించుకోండి అని సలహా యిచ్చారు. పొయిన జన్మలో ఏ పాపం చేసుకున్నాడో కళ్లు లేకుండా పుట్టాడని కూడా మరికొందరు ఈసడించుకున్నారు.

ప్రపంచానికి ఆపిల్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌గా పిలువ బడే స్టీవెన్ పాల్ జాబ్స్ గురించి తెలుసుకుందాం.

1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన స్టీవ్ జాబ్స్‌ని పాల్ మరియు క్లారా జాబ్స్ అనే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత  కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరాడు. ఆయన లారెన్ పాల్‌ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు.

1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.

ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు.

తాను ప్రారంభిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని జాబ్స్ దానిని అలాగే పెట్టుకొన్నాడు అని ఒక కథనం.

తన దగ్గర ఉన్న డబ్బుతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించినందుకు గాను 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు.

కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది. ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEO గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది. జాబ్స్‌కు ప్రస్తుతం ఆపిల్ కంపెనీలో 7,500,000 షేర్లు ఉన్నాయి. 2007 ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్థి విలువ 5.7 బిలియన్ డాలర్లు.

56 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భాదతో ఆయన బుధవారం రాత్రి(అక్టోబర్ 5, 2011) కన్నుమూసారు. 

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం : నో టొబాకో డే -- 31st of May.

పొగాకుతో నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి.

సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి.

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

సుందరాజన్  పిచై లైఫ్ స్టొరీ:

సుందరాజన్  పిచై ని  సుందర్ పిచై అని  కూడా అంటారు.అతను ఒక సీనియర్ సాంకేతిక అధికారి మరియు Google ప్రస్తుత CEO. ఇతడు 12 జూలై 1972న చెన్నై లోని అశోక్ నగర్ లో  పుట్టి, పెరిగాడు.

ప్రణాళిక.. విజయానికి పాచిక 
సమయాన్ని సద్వినియోగం చేసుకోండి... 
విద్యార్థి.. యువతకు నిపుణుల సూచనలివి... 

కడప విద్య, న్యూస్‌టుడే : ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్‌.. మార్చి 15వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. ప్రస్తుత ప్రభుత్వ నోటిఫికేషన్‌తో టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత.. డిగ్రీ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు.. మొత్తంగా ఏ కార్యాచరణతో ఎంత మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారన్న క్షేత్రస్థాయి సమయపాలన అమలు సద్వినియోగంతోనే ఫలితాలు అందుకోనున్నారు. ఒక్కసారి సమయం మించిపోతే ఒత్తిడికి లోనుకావడం, ఆపై ఎంతోమంది యువత ప్రాణాలు విడవడం చూస్తూనే ఉన్నాం. కాలాన్ని ఎలా విభజన చేయాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో ముందుగానే ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారికే జీవితం పూలబాటగా మారుతుంది. ఏ మనిషికైనా రోజుకు 24 గంటలే. అయితే ఆ సమయాన్ని ఉపయోగించుకునే విధానం, ఆలోచన, ప్రణాళికతో వేసే అడుగులే ఒకరిని మొదటి స్థానంలో, మరొకరిని చివరి స్థానంలో, ఎంతో మందిని వారి మధ్యలో నిలిచేలా చేస్తుంది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దాన్ని సాధించుకునే క్రమంలో ఎవరి పట్టుదల, కృషి మేరకు వారు ఫలితాలు అందుకుని ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు. నిద్రలేకుండా చదవడం, చరవాణి, టీవీ, సినిమాలకు సమయం వృథా చేసుకోకుండా, ఒత్తిడిలోనై ఆరోగ్య, ఇతరత్రా సమస్యలు తెచ్చుకోకుండా ముందడుగులు వేయాలని చెబుతున్నారు. అటు విద్యాలయాలలోనూ ఇటు కోచింగ్‌ సెంటర్లలోనూ పరీక్షల వాతావరణం నెలకొన్న దృష్ట్యా సమయపాలన, ప్రణాళిక ప్రాముఖ్యతను విద్యార్థులు, అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

సరైన నిద్ర అవసరం : పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్న సమయంలో మనసు నిద్ర కోరితే కాస్త విశ్రమించడం మంచిదేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిద్ర వచ్చే సమయంలో బలవంతంగా ఆపుకుని చదవడం వల్ల ఏ విషయమూ మెదడుకు చేరకపోగా అనారోగ్యానికి దారితీస్తుంది. రాత్రి 11 గంటల తరువాత చదవడం మంచిది కాదన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. పరీక్షల కాలంలో సరైన నిద్ర లేకుంటే మెదడుకు అలసట పెరిగిపోయి చదువుతున్న అంశాలను గుర్తించుకునే వీలులేకపోవచ్చు. అందుకే రాత్రి 11 గంటల వరకూ చదివి తిరిగి వేకువజామున మూడు గంటల నుంచి చదివేలా ప్రణాళిక చేసుకోవాలి. ఈ సమయంలో మన మెదడులో ఎలాంటి ఆలోచనలు ఉండవు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చదివిన కొద్దిసేపైనా మననం చేసిన ప్రతి అంశం మెదడులో నిక్షిప్తమవుతుంది.

సఖి..న్యాప్‌క్వీన్‌ 
సఖి పేరుతో న్యాప్‌కిన్స్‌ తయారీలో రాణిస్తున్న షంషాద్‌బేగం 

మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆమె. తాను ఎంచుకున్న రంగంలో ఒక పరిశ్రమను స్థాపించి.. తాను బతుకుతూ పది మందికి ఉపాధి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక మహిళ ఒంటరిగా చేతిలో చిల్లిగవ్వ లేకుండానే ఆత్మసైర్థ్యమే ఆలంభనగా ముందుకు సాగారు. క్షేత్రస్థాయి ఎవరి సహకారం లభించలేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు.. చివరికి అనుకున్నది సాధించారు. పరిశ్రమ స్థాపించి ఐదుగురికి ఉపాధి చూపుతూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఆ మహిళ సాధించిన విజయం. 
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం 
కర్నూలు నగరంలోని ధర్మపేటకు చెందిన పొదుపు మహిళ ఎస్‌.షంషాద్‌బేగం. పదో తరగతి వరకు చదివారు. ఆమె భర్త కారు డ్రైవర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మంచానపడ్డారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ధర్మపేటలోని బిస్మిల్లా పొదుపు గ్రూపు లీడర్‌. ఏఎల్‌ఎఫ్‌ రిసోర్స్‌ పర్సన్‌.. స్వరాజ్యం సీఎల్‌ఎఫ్‌ సభ్యురాలిగా సిండికేట్‌ గ్రామీణ ఉపాధి ఉద్యమాభివృద్ధి సంస్థలో శిక్షణకు వెళ్లారు. అక్కడ శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఒక అధికారిణి శానిటరీ న్యాప్‌కిన్‌ పరిశ్రమ గురించి వివరించారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుందని  సలహా ఇచ్చారు.  ఆ అధికారిణి మాటలు షంషాద్‌బేగం మనసులో బలంగా నాటుకుపోయాయి. ఎలాగైనా న్యాప్‌కిన్స్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటే సరిపోదు. ఏదైనా పరిశ్రమ స్థాపనకు పెట్టుబడి కావాలి. తన దగ్గర దానికి సరిపడే డబ్బు లేదు. కుటుంబ పోషణే భారంగా ఉన్న పరిస్థితుల్లోనూ ధైర్యంతో ముందుకు సాగారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్ద్థ (మెప్మా)ను ఆశ్రయించారు. వారు పట్టించుకోలేదు.. సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేదు. అయినా సరే వెనుకడుగు వేయలేదు. 

©2018 APWebNews.com. All Rights Reserved.