ఏంచేయాలి ?

ఫేస్‌బుక్‌ డేటా లీక్‌, ఇటీవల వస్తున్న హ్యాకింగ్‌ వార్తలు యూజర్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే వీటి నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచింది. ఫేస్‌బుక్‌లో ప్రయివసీ సెట్టింగ్స్‌ని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ ఉండండి. అనుమానాస్పదంగా ఏదైనా యాక్టివిటీ కనిపిస్తే ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేయండి.

మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందన్న అనుమానం వచ్చిందా? ముందుగా పాస్‌వర్డ్‌ మార్చేయండి. 
- ఎవరూ గుర్తించలేని విధంగా పాస్‌వర్డ్‌ సెట్‌ చేయండి.
- అక్టివిటీ లాగ్‌ను ఎప్పటికప్పుడూ చెక్‌ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్తే సెక్యూరిటీ అండ్‌ ఫీచర్స్‌లో మీ లాగిన్‌ డీటైల్స్‌ ఉంటాయి. గమనించండి.
- ఇన్‌బాక్స్‌లో వచ్చే స్పామ్‌ లింక్‌లను క్లిక్‌ చేయొద్దు.
- అనుమానాస్పందంగా కనిపించే అకౌంట్లను ఆడ్‌ చేసుకోవద్దు. 
- పాస్‌వర్డ్‌లో లెటర్స్‌, నెంబర్స్‌, స్పెషల్‌ క్యారెక్టర్స్‌ ఉండాలి. కాంప్లెక్స్‌ పాస్‌వర్డ్‌ అంటే జిగ్‌జ్యాగ్‌గా ఉండే పాస్‌వర్డ్‌లు పెట్టడం బెటర్‌... 
- ఫేస్‌బుక్‌ ప్రయివేసీ షార్ట్‌కట్స్‌, సెట్టింగ్స్‌ గురించి పూర్తిగా తెలుసుకోండి.
- ఏదైనా పోస్ట్‌ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
- మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే పోస్టులేవీ చేయకూడదు.
- మీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు వెల్లడించొద్దు.
- మీకు తెలిసినవారి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు మాత్రమే యాక్సెప్ట్‌ చేయాలి
- మీ ఫేస్‌బుక్‌ను ఆల్వేస్‌ లాగిన్‌ స్టేటస్‌లో పెట్టకండి.
- సెక్యూరిటీ అండ్‌ లాగిన్‌ పేజ్‌లోకి వెళ్తే మీరు ఏఏ డివైజ్‌లల్లో లాగిన్‌ అయ్యారో తెలుస్తుంది.
- ఏదైనా అనుమానం వస్తే అందులో 'లాగౌట్‌ ఫ్రమ్‌ ఆల్‌ సెషన్స్‌' క్లిక్‌ చేయండి.
- అదే పేజ్‌లో 2-ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ క్లిక్‌ చేయండి.
- టెక్స్ట్‌ మెసేజ్‌ లేదా ఆథెంటికేషన్‌ యాప్‌ ఆప్షన్‌ ఎంచుకోండి.
- ఫేస్‌బుక్‌ అంటే విసుగొస్తే అకౌంట్‌ డిలిట్‌ చేయొచ్చు.

©2019 APWebNews.com. All Rights Reserved.