నోబెల్‌ పుట్టుక..!

నోబెల్‌ బహుమతిని 1895లో స్వీడన్‌ పౌరుడు ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ రూపొందించారు.

దీన్ని మొదటిసారిగా 1901లో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుదేహ ధర్మశాస్త్రం, సాహిత్యం, ప్రపంచ శాంతి రంగాల్లో ఎంతో కృషి చేసిన ప్రముఖులకు బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. నోబెల్‌ గొప్ప ఇంజనీర్‌. డైనమైట్‌తో పాటు ఆయన 355 సాంకేతిక పరికరాల సృష్టికర్త. అపరిమితంగా ధనాన్ని సంపాదించాడు. నోబెల్‌ సోదరుడు 1888లో చనిపోయినపుడు పొరపాటున పత్రికల్లో నోబెల్‌ పోయాడని వార్తలు వచ్చాయి. ఒక ఫ్రెంచ్‌ పత్రిక మరణవర్తకుడు చనిపోయాడని రాసింది. దానికి మనస్తాపం చెందిన నోబెల్‌ తాను సంపాదించిన ఆస్తినంతా ప్రపంచ శాంతికి పాటుపడే గొప్పవారికి బహుమతిగా ఇవ్వమని వీలునామా రాశాడు. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ 1896లో మరణించారు.

©2019 APWebNews.com. All Rights Reserved.