సూర్యుడు అస్తమించడు!

పొద్దున ఉదయించిన సూర్యుడు ఏది ఏమైనా సాయంత్రానికి అస్తమించి తీరతాడు. అదే ఓ నాలుగు నెలలపాటు సూర్యుడు అస్సలు అస్తమించకపోతే..! ఇంకో నాలుగు నెలలపాటు ఆకాశంలో అస్సలు సూర్యుడే కనిపించకపోతే..!

వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఆ చిత్రమైన ప్రాంతాన్ని చూడాలంటే నార్వేదాకా వెళ్ళి రావాలి. అక్కడ ‘లాంగియర్‌బెన్‌’ అనే ఊళ్ళో మే నుంచి ఆగస్టు దాకా, అంటే నాలుగు నెలల పాటు పగటికీ రాత్రికీ ఏమాత్రం తేడా ఉండదు. ఇరవై నాలుగ్గంటలూ ఆకాశంలో సూర్యుడు వెలిగిపోతూ కనిపిస్తాడు. చేతికి గడియారం లేకపోతే, ఆకాశాన్ని చూసి సమయాన్ని అంచనా వేయడం అక్కడ మహా కష్టం. మరోపక్క నవంబర్‌ నుంచి ఫిబ్రవరి దాకా అదే ప్రాంతంలో అస్సలు సూర్యుడి జాడే కనిపించదు. నాలుగు నెలల పాటు చిమ్మచీకటి అలముకొని ఉంటుంది. భూమికి ఉత్తర దిక్కులో చిట్టచివరన మనుషులు నివసించే ప్రాంతం అదే.

©2018 APWebNews.com. All Rights Reserved.